మెదక్

బీసీలకు టికెట్ వద్దని చెప్పే అధికారం నీకెక్కడిది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూలై 16 : సిద్దిపేట నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వావాదం చోటుచేసుకుంది. పీసీసీ అధికార ప్రతినిధి, నియోజక వర్గం సమన్వయ కర్త రమేశ్, నియోజక వర్గం ఇన్‌చార్జి తాడూరి శ్రీనివాస్‌రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్‌వర్మలు జోక్యం చేసుకోని ఇరువురు కాంగ్రెస్ నేతలను శాంతింప చేశారు. సోమవారం నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో పీసీసీ చేనేత విభాగం చైర్మన్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఓడిపోయే స్థానాల్లో బీసీలకు టీకెట్లు కేటాయిస్తున్నారన్నారు. సిద్దిపేట నియోజక వర్గంలో గత నాలుగు ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి టికెట్లు కేటాయించారని, డిపాజిట్లు సైతం సాధించలేకపోయారన్నారు. దీంతో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి అమ్ముడుపోయారని అపవాదు మూట కట్టుకున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలో బీసీ సామాజిక వర్గానికి టికెట్లు కేటాయించవద్దని, ఓసీ సామాజిక వర్గానికి చెందిన రెడ్డి,వైశ్య, ఎన్‌ఆర్‌ఐలకు టికెట్ కేటాయించాలని అధిష్టాన్ని కోరనున్నట్లు తెలిపారు. దీంతో మాజీ పట్టణ అధ్యక్షుడు సోప్పదండి చంద్రశేఖర్, డీసీసీ జిల్లా కార్యదర్శి మార్క సతీష్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు గూడూరి శ్రీనివాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసి, బీసీలకు టీకెట్ వద్దని చెప్పటానికి నీవు ఏవరివని ప్రశ్నించారు. నావ్యక్తి గత అభిప్రాయం చెపుతున్నాని చెప్పినప్పటికీ నాయకులు తీవ్ర స్థాయి వాగ్వివాదం చేస్తు నీకు ఇష్టం లేకుంటే నాకు వద్దని చెప్పాలని, అందరి గూర్చి చెప్పేందుకు నీకేం అధికారం ఉందని ప్రశ్నించారు. దీంతో జిల్లా సమన్వయ కర్త ప్యాట శ్రీనివాస్, నియోజక వర్గం తాడూరి శ్రీనివాస్‌గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్‌వర్మలు జోక్యం చేసుకొని ఇరువురిని వారించి శాంతింప చేశారు. సమన్వయ కర్త రమేశ్ మాట్లాడుతూ ఇది టికెట్లు కేటాయించే సమావేశం కాదని, నియోజక వర్గంలో పార్టీని బలోపేతం చేసే సమావేశమని స్పష్టం చేశారు. టీకెట్ల పంచాయితీ కాదని, తాము చెప్పగానే టికెట్లు ఏవ్వరికి ఇవ్వరని, టికెట్ల వ్యవహారం అధికారం చూసుకుంటుందన్నారు. అందరు సమష్టిగా పార్టీ విజయం కోసం కృషిచేయాలని సూచించారు.