మెదక్

ఏరియా ఆసుపత్రులకు యువ వైద్యులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జూలై 21: ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగాల భర్తీలో భాగంగా వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఏరియా ఆసుపత్రులకు యువ వైద్యులు వెల్లువెత్తుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు అవసరమైన వైద్యుల పోస్టులను వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో భర్తీ చేస్తున్నారు. అందిన దరఖాస్తులను పరిశీలించిన సంబంధిత శాఖ అభ్యర్థులను ఎంపిక చేసి ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆయా ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటి హెల్త్ సెంటర్లలో పోస్టింగ్‌లు కల్పించారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్‌చెరు, నారాయణఖేడ్, జోగిపేట, సదాశివపేటలోని వైద్య విధాన పరిషత్ ఆధీనంలోని ఆసుపత్రులకు ఇప్పటి వరకు 45 మంది కొత్త వైద్యులు హాజరై విధుల్లో చేరారు. మరో 40 మంది వైద్యులు రావచ్చని సంగారెడ్డి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురారి పేర్కొన్నారు. మెదక్ జిల్లా పరిధిలోని మెదక్, నర్సాపూర్, తూప్రాన్ ఆసుపత్రుల్లో 17 మంది నూతన వైద్యులు విధులకు హాజరవుతున్నారు. మెదక్, నర్సాపూర్‌కు మాత్రమే 17 మంది వైద్యులను వైద్య విధాన పరిషత్ కేటాయించిందని, తూప్రాన్ ఆసుపత్రికి కొత్త వైద్యులు రాలేదని, త్వరలోనే రావచ్చన్న మెదక్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ ఆశాభావం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, నంగునూర్, హుస్నాబాద్, చేర్యాల ఆసుపత్రులకు ఇప్పటి వరకు 19 మంది నూతన వైద్యులు రిపోర్ట్ చేశారు. మరికొంత మంది డాక్టర్లు వచ్చే అవకాశం ఉందని సిద్దిపేట ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నర్సింహం స్పష్టం చేశారు. ప్రధానంగా జనరల్ సర్జన్లు, చిన్న పిల్లల వైద్యులు, గైనకాలజిస్టులు, కార్డియాలజిస్టులు, న్యూరాలజిస్టులు తదితర అన్ని రంగాలకు చెందిన వైద్యులను ప్రభుత్వం భర్తీ చేస్తుండటంతో సర్కారు దవఖానాలపై ప్రజల్లో నమ్మకం ఏర్పడుతోంది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రుల పని తీరు మెరుగుపడటం, కార్పొరేట్ ఆసుపత్రులకు దీటైన సౌకర్యాలను కల్పిస్తుండటంతో సామాన్యుడు మొదలుకొని సంపన్నుల వరకు ప్రభుత్వ ఆసుపత్రుల వైద్య సేవలను ఉపయోగించుకునేందుకు మొగ్గు చూపిస్తున్నారు. సంగారెడ్డిలో దాదాపు 20 కోట్లతో నూతన భవన సముదాయం, ఆధునిక వైద్య పరికరాలతో ఏర్పాటు చేసిన మాత, శిశు సంరక్షణ కేంద్రానికి విశేష ఆదరణ లభిస్తోంది. అన్ని వర్గాల వారు ప్రసూతి కోసం ఈ వైద్యశాలనే ఆశ్రయిస్తుండగా రికార్డు స్థాయిలో సుఖ ప్రసవాలు నిర్వహిస్తున్నారు. వాతావరణ మార్పులు, ఆహార లోపాలు, ఇతరత్ర కారణాలతో అనేక మంది మూత్రపిండాల వ్యాదులతో బాధపడుతున్నారు. వీరంతా డయాలసిస్ నిర్వహించుకోవడానికి నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రులకు వెళితే వారానికి కనీసం నాలుగైదు వేల రూపాయలను ఖర్చు చేసుకోవాల్సి వచ్చేది. కానీ ప్రభుత్వమే ఉచితంగా డయాలసిస్ నిర్వహించడానికి అవసరమైన ఆధునిక పరికరాలతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పేద వర్గాలకు ఎంతో ఉపయుక్తంగా మారాయి. మారుమూల ఉన్న నారాయణఖేడ్‌లో ఒకప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి అత్యంత దయనీయంగా ఉండేది. ఇప్పుడలాంటి దుస్థితి లేకపోగా వివిధ రంగాల నిపుణులతో కూడిన వైద్యులు, ఆధునిక పరికరాలు, మంచాలు, మందుల సౌకర్యం కల్పించడంతో పల్లె ప్రజలు ప్రభుత్వాపత్రికి పరుగులు పెడుతున్నారు. వంద పడకల నూతన ఆసుపత్రి భవనాన్ని సైతం ఇక్కడ నిర్మిస్తుండటంతో వెనుకబడిన నారాయణఖేడ్ ప్రాంతంలో మెరుగైన ప్రభుత్వ వైద్య సేవలు అందడం తథ్యమని చెప్పవచ్చు. నగరంలో అంతర్భాగమైన పటన్‌చెరు ఏరియా ఆసుపత్రికి సైతం మహర్దశ పట్టింది. ఇక్కడి ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తుండటంతో వివిధ రాష్ట్రాల నుండి బతకుదెరువు నిమిత్తం వచ్చిన వేలాది మంది కార్మికుల కుటుంబాలకు పెద్ద దిక్కుగా మారింది. మండల కేంద్రాలు, ఆయా గ్రామాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కూడా అవసరమైన వైద్యులు, ఇతర సిబ్బందిని నియమిస్తుండటంతో గ్రామీణ వైద్యానికి కూడా ఏ మాత్రం డోకాలేకుండా అన్ని సౌకర్యాలు సమకూరుతున్నాయి. ఏలాంటి సమస్యాత్మకమైన వ్యాధికైనా చికిత్సను అందించే వివిధ రకాల వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి వస్తుండటం శుభసూచకం. మొత్తంమీద ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన వైద్యుల పోస్టులను వైద్య విధాన పరిషత్ భర్తీ చేయడం, కొత్తగా వచ్చిన డాక్టర్లంతా యువకులే కావడంతో మంచి వైద్య సేవలు అందడం ఖాయమని చెప్పవచ్చు.

రైతులకు వరప్రదాయని కాళేశ్వరం
* పనులను పరిశీలించిన డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి
మెదక్ రూరల్, జూలై 21: తెలంగాణ రైతాంగానికి వరప్రదాయినిగా కాళేశ్వరం ప్రాజెక్టు మారనుందని డిప్యూటీ ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావుతో కలిసి పద్మాదేవేందర్‌రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. రామడుగు వద్ద 8వ ప్యాకేజ్ పనులను సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను అధికారులు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణలో లక్షలాది ఎకరాల భూములకు సాగునీరందుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం నవయుగ దేవాలయంగా అభివర్ణించారు. ఇలాంటి నిర్మాణాన్ని ప్రత్యక్షంగా పరిశీలించడం మరిచిపోలేని గొప్ప అనుభూతి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో బంగారు, హరిత తెలంగాణగా మారుతుందన్నారు. వ్యవసాయ రంగానికి పెద్దపీటవేస్తు గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల మెదక్ జిల్లా సస్యశ్యామలమవుతుందన్నారు. నిరంతరంగా మంజీరా నది, హల్దీవాగులు పారుతాయన్నారు. వీరి వెంట ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ ఉన్నారు.