మెదక్

జనవరిలోగా వంథశాతం సీసీ కెమెరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఆగస్టు 10 : సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు తగ్గుముఖం పట్టాయని, ప్రజలకు పారదర్శకతతో రక్షణ కల్పించవచ్చని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో 14వ వార్డులో 3లక్షలతో ఏర్పాటు చేసిన 35 సీసీ కెమెరాలు మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సిద్దిపేటలో 220 సీసీ కెమెరాలతో పాటు ఆధునాతనమై కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పట్టణంలో 10 వార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నామని, మిగత వార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుకు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు పోలీసు శాఖకు సహాకరించాలని సూచించారు. సిద్దిపేట జిల్లా అన్నింటిలో ఆదర్శంగా ఉందని, సీసీ కెమెరాల ఏర్పాటులో ఆదర్శంగా ఉండాలని సూచించారు. వందశాతం సీసీ కెమెరాలు ఉన్న జిల్లాగా సిద్దిపేటకు ప్రత్యేక గుర్తింపు తేవాలన్నారు. జనవరి 1లోగా టార్గెట్‌గా ఎంచుకొని వందశాతం సీసీ కెమెరాలు ఏర్పాటు నిఘా నీడలో సిద్దిపేటను ఆదర్శంగా నిలపాలన్నారు. ఒక్కో సీసీ కెమెరా 5గురు పోలీసులతో సమానమన్నారు. పోలీసులకు పనిభారం తగ్గటంతో పాటు కేసుల విచారణలో పారదర్శకత పెరుగుతుందన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటుకు సహాకరించిన ప్రజాప్రతినిధులు, వ్యాపారులను, వైద్యులను అభినందించారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ మాట్లాడుతూ ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణకు ఏర్పాటు చేసిన వ్యవస్థనే పోలీసు వ్యవస్థ అన్నారు. ప్రజలకు న్యాయం చేసేందుకు నిరంతరం పోలీసు శాఖ పనిచేస్తుందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సీసీ కెమెరాలు ఏంతగానో దోహదపడుతాయన్నారు. అమాయకులను రక్షించేందుకు సీసీ కెమెరాలు ఏంతో దోహదపడుతాయన్నారు. హైదరాబాద్ నగరంలో సీసీ కెమెరాలు ఏర్పాటులో చాల నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. సిద్దిపేట జిల్లాలో 2వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, జనవరి 1 నాటికి 10వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సీసీ కెమెరాలు పుటేజీల వల్ల నేరస్తులకు వంద శాతం శిక్ష పడుతుందన్నారు. సున్నితమైన ప్రాంతాల్లో నిఘా, సీసీ కెమెరాలు ఏంతో కీలక పాత్ర వహిస్తాయన్నారు. సీసీ కెమెరాలు 24 గంటలు, 365 రోజులు నిర్విరామంగా, నిరంతరాయంగా పనిచేస్తాయన్నారు. సీసీ కెమెరాలతో సిద్దిపేట జిల్లాలో 50 కేసులను ఛేదించినట్లు తెలిపారు. సీసీ కెమెరాలకు జియో ట్యాగింగ్ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు వన్‌టౌన్‌లోని కమాండ్ కంట్రోల్ రూంకు త్వరలో అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటుకు సహాకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, అడీషనల్ సీపీ నర్సింహరెడ్డి, ఏసీపీ రామేశ్వర్, కౌన్సిలర్లు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, ప్రభాకర్, బాల్‌లక్ష్మిఆనంద్, సంపత్‌రెడ్డి, వైద్యులు భాస్కర్‌రావు, గాయత్రి, రవీంద్రనాథ్, చందర్, సీఐ నందీశ్వర్‌రెడ్డి, సైదులు, ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

- రెడ్‌క్రాస్ సేవలకు గుర్తింపు -
గవర్నర్ చేతులమీదుగా కలెక్టర్‌కు అవార్డు
సంగారెడ్డి, ఆగస్టు 10: రెడ్‌గ్రాస్ సేవలకు గుర్తింపు లభించిన సేవా అవార్డును సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు శుక్రవారం రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నర్సింహన్ చేతులమీదుగా అందుకున్నారు. 2017-18 సంవత్సరానికి రెడ్‌క్రాస్ సేవలకు గుర్తింపుగా జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుకు సేవా అవార్డును ప్రకటించారు. అట్టి అవార్డును శుక్రవారం రాజ్‌భవన్‌లోని కమ్యూనిటీహాల్ సంస్కృతిలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ నర్సింహన్ సేవా అవార్డును కలెక్టర్‌కు ప్రధానం చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత మొట్టమొదటి సారిగా గవర్నర్ చేతులమీదుగా అవార్డును అందుకోవడం చాలా సంతోషాన్నిచ్చిందన్నారు. ఇలాంటి అవార్డుల ద్వారా బాధ్యత మరింత పెంచుతుందని, ప్రజలకు మంచి సేవలు అందించాలనే లక్ష్యాన్ని కలిగిస్తుందన్నారు. సంగారెడ్డి జిల్లా ప్రజలకు ఎళ్లప్పుడు అందుబాటులో ఉండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను చేరవేయడంలో తనవంతు కృషి చేస్తానన్నారు. జిల్లాలో పని చేస్తున్న అన్ని స్థాయిల అధికారులతో మమేకమై జవాబుదారితనంగా పని చేసి సంగారెడ్డి జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు శాయశక్తుల కృషి చేస్తానన్నారు. చేసే సేవలకు ఎప్పుడు గుర్తింపు ఉంటుందన్న దానికి తార్కాణంగా గవర్నర్ చేతులమీదుగా అందుకున్న అవార్డు నిలుస్తుందన్నారు. కాగా కలెక్టర్ హోదాలో మొట్టమొదటి సారిగా అవార్డును అందుకున్న కలెక్టర్‌కు జిల్లా స్థాయి అధికారులు, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు అభినందనలు తెలియజేసారు.

ఎగుమతి చేసేలా ఎదగాలి
మత్స్యకారులకు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పిలుపు
మెదక్ రూరల్, ఆగస్టు 10: చేపలు, విత్తనం ఎగుమతి చేసేలా తెలంగాణ మత్స్యకారులు ఎదగాలని డిప్యూటీ స్పీకర్ ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని రాయిన్‌పల్లి ప్రాజెక్టులో 2.43 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతూనే, కుల వృత్తుల బాగుకోసం బడ్జెట్ కేటాయించారన్నారు. చెరువు బాగుంటే ఊరుబాగుంటుంది, కుల వృత్తుల వారికి దోహదపడుతుందన్న ఉద్దేశ్యంతో మిషన్ కాకతీయ ద్వారా 45 వేల చెర్వులు బాగుచేయడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం ఆకాశం వైపు చూడాల్సి వస్తోంది. వరుణుడిపై భారం వేసి పంటలు పండించే దుస్థితి నెలకొంది. ప్రత్యామ్నాయంగా గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలవకుండా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మించి నిరంతరంగా సాగునీరు వచ్చేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని, త్వరలోనే నీరు వస్తుందన్నారు. రామాయంపేట, నిజాంపేట మండలాలు ఎత్తుపై ఉన్నందున ప్రత్యేక కాలువ తవ్వుతున్నట్లు తెలిపారు. చిన్నశంకరంపేట నుండి అంబాజిపేట మీదుగా కోంటూరు పెద్ద చెర్వు నిండుతుందన్నారు. ప్రాజెక్టులు నిర్మిస్తుంటే కాంగ్రెస్ నాయకులు కేసులతో అడ్డం పడుతున్నారని ఆరోపించారు. మంజీరా నదిపై చెక్‌డ్యాంల నిర్మాణం వల్ల చేపలు పెంచవచ్చన్నారు. మనం చేప విత్తనం ఆంధ్రా నుండి తీసుకురాకుండా తెలంగాణలోనే చేపలు, విత్తనం తయారుచేసి ఎగుమతిచేసి ఆదర్శంగా నిలవాలన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం, కాలువల తవ్వకానికి రైతుల త్యాగం తప్పదన్నారు. అన్నదాత బాగుంటేనే అందరూ బాగుంటారని పేర్కొన్నారు. కుల వృత్తులవారు ఆర్థికంగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. చేపల మార్కెట్ ఏర్పాటుకు 50 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 15నుండి నిర్వహించే కంటివెలుగు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనేక అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న ముఖ్యమంత్రిని ఆశీర్వదించాలని పద్మాదేవేందర్‌రెడ్డి కోరారు.
జాయింట్ కలెక్టర్ నగేశ్ మాట్లాడుతూ చేపల పెంపకం ద్వారా మత్స్యకారులు ఆర్థికంగా ఎదగడమే కాకుండా సమాజ శ్రేయస్సుకు, ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడవచ్చన్నారు. ఉత్పత్తి, మార్కెటింగ్ ద్వారా రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుతుందన్నారు. జిల్లా మత్స్యకారుల సంఘం అధ్యక్షులు గున్నాల నర్సింలు మాట్లాడుతూ మత్స్యకారులకు మోపెడ్, వాహనాలు, వలలు, తెప్పలు అందజేయడానికి సిద్దం చేశామన్నారు. గత ప్రభుత్వంకంటె ఎక్కువగా అందజేయడం జరుగుతుందన్నారు. జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో మొదటిసారిగా రాయిన్‌పల్లి ప్రాజెక్టులో ఉచితంగా చేప పిల్లలు విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి లావణ్యారెడ్డి, ఆర్‌డిఓ నగేశ్, ఇరిగేషన్ జిల్లా అధికారి ఏసయ్య, డిఇ శివనాగరాజు, ఎఇ శ్రీహరిగౌడ్, తహశీల్దార్ యాదగిరి, గ్రామ ప్రత్యేక అధికారి తేజస్వి, మండల పార్టీ అధ్యక్షులు అంజాగౌడ్, నాయకులు కిష్టయ్య, నర్సింలు, నారాయణ, సుదర్శనం, నర్సింలు పాల్గొన్నారు.

విభజన హామీలు నేరవేర్చనప్పుడు
బీజేపీకీ టీఆర్‌ఎస్ మద్దతు ఎందుకు?
* 1 నుండి మోదీకి హటావో.. దేశ్‌కు బచావో యాత్రలు
* ఈనెల 13న హామీల అమలుకై కలెక్టరేట్‌ల ముట్టడి
* సీపీఐ రాష్ట్ర క్రార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
సిద్దిపేట, ఆగస్టు 10 : టీఆర్‌ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చి నాలుగేండ్లు గడిచిన విభజన హామీలు నేరవేరలేదన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోద, హైకోర్టు విభజనలో ఏ ఒక్కటీ నేరవేర్చకపోయి కేంద్రంలోని బీజేపీ సర్కార్‌కు టీఆర్‌ఎస్ సర్కార్ ఎందుకు మద్దతు ఇస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ సర్కార్ కేంద్రంతో సఖ్యతగా ఉంటూ రాష్ట్ర పతి ఎన్నికల్లో పాటు, రాజ్యసభ ఉపాధ్యక్ష పదవి ఎన్నిక, అవిశ్వాస తీర్మానంలో బీజేపీకి టీఆర్‌ఎస్ పార్టీకి అడుగడుగునా మద్దతు ఇచ్చిందన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర పాలన కుంభకోణాలకు నిలయంగా మారిందన్నారు. శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని విమర్శించారు. బ్యాంకులన్ని లూటీ అయ్యాయన్నారు. కార్పొరేట్ సంస్ధలకు 3.50లక్షల మొండిబకాయిలు రద్దు చేసి, ఎర్ర తివాచి పర్చారని విమర్శించారు. రైతులకు మాత్రం ఒక్క రూపాయి కూడ మాఫీ చేయలేదని విమర్శించారు. మోదీ పాలనలో రాజ్యాంగం ఉల్లంఘన, మతోన్మాదం పెరిగిపొతుందన్నారు. సెప్టెంబర్ 1 నుండి అక్టోబర్ 12 వరకు మోడీ హటావో...దేశ్‌కు బచావో పేరిట దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రజాచైతన్య యాత్రలు చేపట్టనున్నట్లు తెలిపారు.
కేసీఆర్ పాలన ఆర్భాటం ఎక్కువ..అమలు తక్కువ
తెలంగాణ సీఎం కేసీఆర్ పాలన ఆర్భాటం ఎక్కువ...అమలుకు తక్కువ అని పని జానేడు అయితే..ప్రచారం బారెడు చేసుకుంటారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు అధిక ప్రాధాన్యత కల్పిస్తు మిగత ప్రాజెక్టులను పట్టించుకోవటం లేదని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని శాఖల్లో బకాయిలు పేరుకపోయాయని.. అభివృద్ధి కుంటుపడిందన్నారు. సాగునీటిశాఖలో 7వేల కోట్లు, మిషన్‌కాకతీయ, ఆర్‌అండ్‌బి, పీఆర్‌లో 3వేల కోట్ల బకాయిలు పెరిగిపోయాయన్నారు. ఎస్‌హెచ్‌జి గ్రూపులకు 11వేల కోట్ల పావుల వడ్డీ రుణాలు బాకాయిలున్నాయన్నారు. మధ్యాహ్నా బోజన కార్మికులకు 500 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని విమర్శించారు. 1.20 లక్షల కోట్ల అప్పులు తెచ్చి, ప్రతి వ్యక్తిపై 30వేల భారం మోపాడని విమర్శించారు. రైతును రాజును చెస్తానని చెప్పి రైతు చేతికి సంకెళ్లు వేశారన్నారు. రాష్ట్రంలో ఏ ఉద్యోగి సైతం సంతృప్తిగా లేడని విమర్శించారు.తెలంగాణ వస్తే బాగుపడుతామనుకుంటే గత ప్రభుత్వాల పాలన కంటే అధ్వాన్నంగా ఉందని దుయ్యపట్టారు. తెలంగాణ సర్కార్ ఇచ్చిన హామీల అమలుకోసం, సమస్యల పరిష్కారం కోసం ఈనెల 13న అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్‌ల ముట్టడీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాలోని సీపీఐ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరై కలెక్టరేట్ ముట్టడీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈసమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, నాయకులు వెంకట్రామ్‌రెడ్డి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.