మెదక్

పద్మక్క ఎన్నికల ప్రచారం షురూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నశంకరంపేట, సెప్టెంబర్ 12: ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద మాజీ ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి అమరవీరులకు నివాళులు అర్పించారు. భారీ ర్యాలీ మధ్య రథయాత్రతో ప్రచారం మొదలుపెట్టారు. బాణాసంచా పేల్చుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా బంగారు తెలంగాణగా మార్చడం కోసం ఏవైతే పథకాలు చేపట్టడం జరిగిందో వాటన్నింటిని పూర్తి చేయడం కోసం కాలేశ్వరం నుండి మెదక్ నియోజకవర్గానికి తాగునీరు అందించడం కోసం తనకు మెదక్ శాసనసభ టికెట్ ఖరారు చేసిన ముఖ్యమంత్రికి పాదాభివందనాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. రెండవ దఫ తనను దీవించాలని ఆమె ప్రజలను కోరారు. ఆపద్దర్మ ముఖ్యమంత్రి తనకు మెదక్ అభ్యర్థి టికెట్ ఇచ్చినందుకు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా చూస్తానన్నారు. ప్రజల ఆశయం మెదక్ జిల్లాను ఏర్పార్చుకున్నట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం రెండు వేల కోట్ల రూపాయలు మంజూరు చేసుకున్నట్లు తెలిపారు. ఇరిగేషన్‌కు పెద్దపీట వేసి ఎంఎన్, ఎఫ్‌ఎన్ కెనాల్స్‌ను ఏర్పాటు చేసుకున్నామనారు. భవిషత్తులో భగీరథ పథకం ద్వారా మంచినీటి కోసం పనులు నిర్మాణం చేసుకున్నామని, 15 రోజుల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. అమరుల త్యాగఫలం వల్ల ఏర్పడిన తెలంగాణలో వారి కుటుంభాలను ఆదుకుంటామని, వీరి ఆశయాలకు నేడు అమరవీరులకు ఘన నివాళులు అర్పించి ఎన్నికల ప్రచారం చిన్నశంకరంపేట అమరవీరుల స్థూపం నుండి మొదలుపెట్టినట్లు తెలిపారు. తనను ప్రజలు దీవిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ గంగ నరేందర్, వైస్ ఎంపీపీ విజయలక్ష్మీ, లక్ష్మారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పి.రాజు, మాజీ సర్పంచ్‌లు కుమార్‌గౌడ్, సాన సత్యనారాయణ, సురేందర్, రమేశ్‌గౌడ్, లక్ష్మాగౌడ్, ఉప్పరి శ్రీనివాస్, రాఘవులు తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంత వాతవరణంలో పండుగను జరుపుకోవాలి
*శాంతి కమిటీ సమావేశం ఏఎస్పీ మహేందర్
సంగారెడ్డి టౌన్, సెప్టెంబర్ 12: గణేష్ నవరాత్రుల ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఏఎస్పీ మహేందర్ సూచించారు. వినాయక చవితి పండగను పురస్కరించుకొని బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని కల్యాణ మండపంలో మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండ, మత సామరస్యంతో వినాయక చవితి పండగను జరుపుకోవాలని కోరారు. రాత్రి సమయాల్లో గణేష్ మండపాల వద్ద జాగ్రత్తగా ఉండాలని నిర్వాహకులకు సూచించారు. పండగ సందర్భంగా గట్టిబందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని, ఎలాంటి అనుమాన సంఘటనలు ఉన్నా వెంటనే సమాచారం అందించాలని కోరారు. డీజే సౌండ్ బాక్స్‌లు పెట్టేందుకు అనుమతులు లేవని ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. సంగారెడ్డి డీఎస్పీ శ్రీ్ధర్‌రెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మకూడదని, ఫేస్‌బుక్, వాట్సప్ వంటి సామాజిక మాధ్యమాలలో వచ్చే వార్తలలో చాల వరకు తప్పుడు వార్తలేనని, ఎవరైన ఇలా తప్పుడు వార్తలను, మార్పింగ్ చేసిన ఫోటోలను ప్రచారం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వివిధ మతాలకు చెందిన మత పెద్దలు మాట్లాడుతూ శాంతియుతంగా పండగను జరుపుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అందరి మనోభావాలు గౌరవిస్తూ పోలీస్ అధికారుల సూచనలు పాటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, పట్టణ సీఐ వెంకటేశ్, ట్రాఫిక్ సీఐ సంజయ్‌కుమార్, వివిధ మతాలకు చెందిన పెద్దలు వేణుగోపాల్, అన్వర్, బుచ్చిరెడ్డి, తాహేర్, అబుబకర్, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు.