మెదక్

బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, సెప్టెంబర్ 18 : తెలంగాణ రాష్ట్రంలో బ్రాహ్మణుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. మంగళవారం పలుబ్రాహ్మణ సంఘాల నేతలు, వేద పండితులు, అర్చకులు మంత్రి నివాసంలో కలసి వేద ఆశీర్వచనం అందచేశారు. సిద్దిపేట జిల్లాలో పలు పురాతన ఆలయాల పునరుద్ధరణ కోసం సర్వశ్రేయోనిధి నుంచి కోట్లాది రూపాయలు మంజూరు చేయటమే గాకుండా, 142 దేవాలయాలను దూప, దీప నైవేధ్య పథకంలో చేర్చి పేద బ్రాహ్మణులను, అర్చకులను ఆదుకున్నందుకు వారు మంత్రి హరీష్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా మంత్రి హరీష్‌రావుకు వేద ఆశీర్వచనం అందించి పట్టువస్త్రాలు, శాలువా, పూలహారం, పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా మంత్రి హరీష్‌రావు బ్రాహ్మణుల నుద్దేశించి మాట్లాడుతూ గతంలో ఎన్నడు లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో బ్రాహ్మణుల పురోభివృద్ధికి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. పురాతన ఆలయాల పునరుద్ధరణ, పేద అర్చకుల ఉపాధి,సంక్షేమం కోసం దూప, దీప నైవైద్య పథకం తదితర ఏన్నో ధార్మిక సంబంధ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు మంత్రి హరీష్‌రావు వివరించారు. టీఆర్‌ఎస్ పార్టీకి బ్రాహ్మణుల దీవేనలు ఉండాలని కోరారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో తామంత టీఆర్‌ఎస్ విజయానికి కృషిచేస్తామని మంత్రిని కలసిన బ్రాహ్మణ, అర్చకుల బృందం ప్రతినిధులు తెలిపారు. సిద్దిపేట జిల్లా కడవేర్గులోని పురాతన లక్ష్మినారాయణ ఆలయం పునరుద్దరణ కోసం, కొండపాక రుద్రేశ్వరాలయం వేద పాఠశాల ఏర్పాటుకోసం తగిన చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి హరీష్‌రావు బ్రాహ్మణుల బృందానికి హామీనిచ్చారు. ఈకార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు తీగుళ్ల కృష్ణమూర్తి, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యులు మరుమాముల వెంకటరమణ శర్మ, ఎం.రాంచంద్రమార్తి, గౌరీభట్ల సుబ్రమణ్యశర్మ, సిద్దిపేట జిల్లా బ్రాహ్మణ సంఘం ముఖ్యలు అప్పాల మాధవశర్మ, రాధాపతిశర్మ, రాయప్రోలు మల్లికార్జున్‌శర్మ, సీతారామశర్మ, జగన్మోహన్‌శర్మ, వేద పండితులు గుండు రామశర్మ, తీగుళ్ల దామోదర శర్మ సిద్ధాంతి, నారాయణశర్మ, శ్యాంమోహన్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

ఈవీఎంల ఫస్ట్ లెవల్ చెకప్
* రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలన
* ఏలాంటి సందేహాలున్నా ఒకటికి రెండుసార్లు చూపించాలి
* కలెక్టర్ ఎం.హన్మంతరావు
సంగారెడ్డి టౌన్, సెప్టెంబర్ 18: సంగారెడ్డి పాత డీఆర్‌డీఎ కార్యాలయ ఆవరణలోని గోదాంలో భద్రపర్చిన ఈవీఎంలను మంగళవారం వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో ఫస్ట్ లెవల్ చెకప్ నిర్వహించారు. బెంగుళూర్ బెల్ కంపెనీకి చెందిన 11మంది ఇంజనీర్లు, ఒక సూపీరియర్ అధికారి ఎవీఎంలను (బ్యాలెట్ యూనిట్స్ అండ్ కంట్రోల్ యూనిట్లు) ఫస్ట్ లెవల్ చెకప్ చేసి ధ్రువీకరణ ఇస్తున్నారు. ఈవీఎంల ప్రథమస్థాయి పరిశీలన రాజకీయ పార్టీల ప్రతినిధులు, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఫస్ట్ లెవల్ చెకప్ నిమిత్తం హాలులో 11టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో ఇంజనీరు ఒక్కో టేబుల్‌పై ఏర్పాటు చేసిన 10బ్యాలెట్ యూనిట్లు, 10కంట్రోల్ యూనిట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల ముందే పరిశీలించి పని చేస్తున్నది, లేనిది ధ్రువీకరిస్తున్నారు. జిల్లాకు 2350 బ్యాలెట్ యూనిట్లు, 1830 కంట్రోల్ యూనిట్లు, 1980 వీవీప్యాట్స్ వచ్చాయన్నారు. కలెక్టర్ హన్మంతరావు సంబంధిత బెల్ ఇంజనీర్లతో మాట్లాడుతూ రోజుకు వీలైనన్ని ఈవీఎంల చెకప్‌లు పూర్తిచేయాలని, రోజు వారి షెడ్యూల్ మేరకు ఈవీఎంలు, వీవీప్యాట్‌ల పరిశీలన పూర్తి చేయాలని కోరారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జరుగుతున్న ఈ ప్రక్రియలో వారికి ఏలాంటి సందేహాలున్నా ఒకటికి రెండు సార్లు చెకప్ చేసి చూపించాలని తెలిపారు. గోదాంలో నిర్వహిస్తున్న ఈవీఎంల ఫస్ట్‌లెవల్ చెకప్ కార్యక్రమం, భద్రత ఏర్పాట్లను ఎస్పీ చంద్రశేఖరెడ్డి పరిశీలించారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌ల భద్రతపై ఆరా తీశారు. పరిశీలించిన బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లను తీసిన బాక్సులలోనే భద్రపర్చాలని జాయింట్ కలెక్టర్ నిఖిల సంబంధిత సిబ్బందికి సూచించారు. తొందర పడకుండా, జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. ఏలాంటి సమస్య, ఇబ్బంది లేకుండా అన్ని వేళల అప్రమత్తులై విధులు నిర్వహించాలని రెవెన్యూ సిబ్బందికి సూచించారు. అన్ని పనులు సవ్యంగా జరిగేలా జేసీ అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. కార్యక్రమంలో డిఆర్వో వెంకటేశ్వర్లు, డిఎస్‌ఓ శ్రీకాంత్‌రెడ్డి, ఆర్టీఓ శ్రీను, డీఐఓ శాంతికుమార్, తహసీల్ధార్ విజయ్‌కుమార్, ఏఓ గుండెరావు, టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ, సీపీఎం, సీపీఐ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.