మెదక్

కస్తూర్బా విద్యాలయంలో విద్యుదాఘాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, సెప్టెంబర్ 20: గజ్వేల్ పట్టణంలోని కస్తూర్బా విద్యాలయంలో గురువారం తెల్లవారుజామున విద్యుదాఘాతం చోటుచేసుకుంది. అయితే విద్యార్థులకు స్టడీహవర్ కావడంతో పెను ప్రమాదం తప్పగా, ఇద్దరు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. కస్తూర్బా విద్యాలయంలోని రూం నెంబర్ 4లో షాక్‌సర్క్యూట్ జరగడంతోవిద్యార్థుల దుస్తులు, దుప్పట్లు, స్టడీ మెటీరియల్ పూర్తిగా దగ్దమైంది. అయితే అక్కడే ఉన్న ప్రిన్సిపాల్ అనురాద, సిబ్బంది శోభారాణి కలసి మంటలు ఆర్పే ప్రయత్నం చేసిన ప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కాగా ఫైర్‌స్టేషన్‌కు సమాచారం చేరవేసినప్పటికీ సిబ్బంది నుండి స్పందన కరువైందని కస్తూర్బా ప్రిన్సిపాల్ అనురాధ ఆవేదన వ్యక్తం చేశారు. కస్తూర్బా పాఠశాలలో 294 మంది విద్యార్థినులకుగానూ 278 మంది హాజరవడంతోపాటు 52 మంది ఇంటర్ చదివే విద్యార్థినులు ఉన్నారు. పాఠశాల సిబ్బంది, విద్యార్థినులు సమీపంలో ఉన్న నీటితో మంటలు ఆర్పి వేయగా, పక్క గదులకు మంటలు వ్యాపించకుండా చేసిన ప్రయత్నం ఫలించింది. లేకుంటే పెద్ద ప్రమాదం చోటుచేసుకునేదని ప్రిన్సిపాల్ అనురాద పేర్కొన్నారు. కస్తూర్బా విద్యాలయంలో జరిగిన షార్ట్‌సర్క్యూట్ సమాచారం అందుకున్న గడా అధికారి ముత్యంరెడ్డి, మున్సిపల్ చైర్మెన్ గాడిపల్లి భాస్కర్, ఆర్డీఓ విజేందర్‌రెడ్డి అక్కడికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు. అనంతరం కస్తూర్బాలో చోటుచేసుకున్న ఘటనను ఉన్నతాధికారులకు చేరవేయగా, వెంటనే మరమ్మత్తులు చేపట్టడంతోపాటు విద్యార్థులకు అవసరమయ్యే దుస్తులు, దుప్పట్లు, స్టడీమెటీరియల్ అందించాలని సంబందిత అధికారుల ను ఆదేశించినట్లు గడా అధికారి ముత్యంరెడ్డి పేర్కొన్నారు.

రోడ్డుప్రమాదంలో ఇద్దరి మృతి
కొండాపూర్, సెప్టెంబర్ 20: అతివేగంతో జేసీబీని ఢీకొట్టి ఇద్దరు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని జాతీయ రాహదారిపై చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపిన కథనం ప్రకారం జహీరాబాద్ నుండి హైదారాబాద్ వైపు స్కారిఫియో వాహనంలో వస్తున్న శంకర్‌పాండే (53), దేవేందర్‌రెడ్డి(50)లు ఈ ప్రమాదంలో మృతి చెందారు. ప్రమాదానికి అతివేగమే కారణమైనట్లు ఎస్‌ఐ తెలిపారు. మల్కాపూర్ చౌరస్తా వద్ద అండర్ బ్రిడ్జి పనులు కొనసాగుతున్నాయి. పనుల్లో భాగంగా అక్కడే ఉన్న జేసీబీని అతివేగంతో ఢీకొట్టిన స్కారిఫియో వాహనం గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో దేవేందర్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, శంకర్ సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. హైదరాబాద్‌కు చెందిన శంకర్‌పాండే జహీరాబాద్‌లోని మహేంద్ర అండ్ మహేంద్ర స్కూల్ ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కోహీర్ మండలం కావేళ్లి గ్రామానికి చెందిన దేవేందర్‌రెడ్డి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మృతుడు దేవేందర్‌రెడ్డి భార్య సునిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.