మెదక్

బీజేపీ వైపు దేశ్‌పాండే చూపు?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, సెప్టెంబర్ 20: కొండాపూర్ మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే భారతీయ జనతా పార్టీవైపు దృష్టి సారించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలో కొనసాగనున్న ముందస్తు ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు దేశ్‌పాండే తహతహలాడుతున్నట్లు తెలిసింది. 2014 ఎన్నికల సమయంలోనే టీఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు అప్పట్లో దరఖాస్తు చేసుకున్న దేశ్‌పాండేకు నిరాశ ఎదురైంది. ప్రస్తుతానికి టీఆర్‌ఎస్ పార్టీలో కొనసాగుతున్న దేశ్‌పాండేను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ నాయకులు చాపక్రింద నీరులా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర మంత్రి సుస్మాస్వరాజ్ త్వరలోనే సంగారెడ్డి నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు తెలిసింది. అమిత్‌షా సమక్షంలో దేశ్‌పాండే కమలం గూటికి చేరే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. జాతీయ నేతల సమక్షంలోనే సంగారెడ్డి టికెట్‌ను దేశ్‌పాండేకు కేటాయిస్తున్నట్లు ప్రకటించే విధంగా వ్యూహరచనలు చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ నియోజకవర్గం టికెట్‌ను దక్కించుకునేందుకు బీజేపీ పార్టీలో కొనసాగుతున్న నాయకులు ఎవరి ప్రయత్నం వారు చేసుకుంటున్నారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన నాయకుడు, కొండాపూర్ మండలంలో తనకంటూ ఒక వర్గాన్ని విస్తరింపజేసుకున్న దేశ్‌పాండేకు గాలం వేస్తే టీఆర్‌ఎస్‌కు చెక్‌పెట్టినట్లు అవుతుందనే ఉద్దేశంతో బీజేపీ నేతలు పావులు కదుపుతున్నట్లు తెలిసింది. దేశ్‌పాండే కాషాయం కండువా ధరిస్తే టీఆర్‌ఎస్ పార్టీకి మంచి జట్కా తగలడం ఖాయమే. మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ తాజామాజీ ఎమ్మెల్యే పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ బీ ఫాం ఇవ్వకూడదని బహిరంగంగానే డిమాండ్ చేసాడు. దేశ్‌పాండే కూడా తాజామాజీ ఎమ్మెల్యేపై అసంతృప్తితోనే ఉన్నా పైకి కనిపించకుండా తన రాజకీయ భవిషత్తును నిర్దేశించుకునే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. దేశ్‌పాండే పార్టీ మారడంపై టీఆర్‌ఎస్ పార్టీలో చర్చనీయాంశంకాగా, కొండాపూర్ మండలంలో బీజేపీకి పూర్వవైభవం లభిస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్‌లో ప్రారంభించిన దేశ్‌పాండే మద్యలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన నేతగా కొనసాగి గడచిన 2014 ఎన్నికల సమయంలో గులాబి తీర్థం పుచ్చుకుని టికెట్‌ను ఆశించాడు. దేశ్‌పాండేకు టికెట్ లబించకపోవడం, ఈ సారి కూడా నిరాశ ఎదురుకావడంతో బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి కూడా టికెట్ రేస్‌లో ఉండటంతో దేశ్‌పాండే ఎత్తులు ఫలిస్తాయా లేదా అన్న చర్చ కూడా కొనసాగుతుంది. మొత్తంమీద సంగారెడ్డి నియోజకవర్గంలో దేశ్‌పాండే తన రాజకీయ భవిషత్తును తేల్చుకునే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.

దూకుడు పెంచండి
* కేసీఆర్ ఓటమే లక్ష్యంగా శ్రమించండి
* పేద వర్గాల సంక్షేమం కోసం మెనిఫెస్టో రూపకల్పన
* పీసీసీ చీఫ్ ఉత్తంకుమార్‌రెడ్డి
గజ్వేల్, తూప్రాన్, సెప్టెంబర్ 20: భయంతో ముందస్తు ఎన్నికలకు వెల్లిన టీఆర్‌ఎస్ ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దూకుడు పెంచి గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడించాలని పీసీసీ చీఫ్ ఉత్తంకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం తూప్రాన్ మండల పరిదిలోని ఆయా గ్రామాలకు చెందిన 200ల మంది టీఆర్‌ఎస్ శ్రేణులు కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిది వంటేరు ప్రతాప్‌రెడ్డి సమక్షంలో గాందీభవన్‌లో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్బం గా ఆయన మాట్లాడుతూ కష్టపడే కార్యకర్తలకు సముచిత గౌరవం ఉంటుందని, టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాల ఫలితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా పేద వర్గాల సంక్షేమం కోసం చక్కటి మెనిఫెస్టోను రూపకల్పన చేస్తుండగా, అభివృద్ది, సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాద్యపడుతుందన్న విషయాన్ని ప్రజలు ఇప్పటికే గుర్తించినట్లు తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా జనం గుణపాటం చెప్పడానికి సిద్ధంగా ఉండగా, యువత, నిరుద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు, మహిళలు, రైతులు, ఉద్యోగ, ఉపాద్యాయులు టీఆర్‌ఎస్‌ను ఓడించడానికి సన్నద్ధంగా ఉన్నట్లు వివరించారు.