మెదక్

త్యాగానికి ప్రతీక మొహర్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, సెప్టెంబర్ 21: మొహర్రం పండుగ త్యాగానికి ప్రతీకగా నిలుస్తోందని రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిది వంటేరు ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం గజ్వేల్ మున్సిపల్ పరిదిలోని ఆయా ప్రాంతాల లో మొహర్రం పండగ సంబరాల్లో పాల్గొని మాట్లాడారు. హిందూ, ముస్లింలు సంఘటితంగా ఉంటేనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ది సాదిస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్‌తోనే మైనార్టీల అభ్యున్నతి సాద్యపడుతుందని, అయితే ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకునే క్రమంలో రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చిన కేసీఆర్ ఆ నెపాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై నెట్టి చేతులు దులుపుకున్నట్లు చెప్పారు. ప్రధానితో స్నేహం చేస్తున్న కేసీఆర్ మైనార్టీ రిజర్వేషన్ అంశం ఎందుకు ప్రస్తావించడంలేదని నిలదీస్తూ ఓటమి భయంతోనే టీఆర్‌ఎస్ ముందస్తు ఎన్నికలకు వెల్తోందని ఎద్దేవా చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడిన టీఆర్‌ఎస్‌కు ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్దంగా ఉండగా, పేదల సంక్షేమం కోసం మంచి మెనిఫెస్టో కాంగ్రెస్ అందుబాటు లోకి తెస్తోందని తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కగా, రూ. 2లక్షల పంటరుణమాఫీ, రూ. 6లక్షలతో ఇంటి నిర్మాణం, రూ. 3వేల నిరుద్యోగ బృతి, ఇప్పుడు ఇస్తున్న పెన్షన్‌ల డబ్బు రెట్టింపు చేసే దిశగా రూపుదిద్దుకుంటోందని వివరించారు.