మెదక్

మైనార్టీల అభివృద్ధికి కృషి -ఎంపీ బీ.బీ.పాటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోగిపేట, సెప్టెంబర్ 21: మైనార్టీల అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని జహిరాబాద్ ఎంపీ బీబీ.పాటిల్ అన్నారు. శుక్రవారం జోగిపేట పట్టణంలోని వెంకటేశ్వర గార్డెన్‌లో జరిగిన మైనార్టీల చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ మైనార్టీల కోసం ఎంతగానో కృషి చేయడం జరిగిందన్నారు. ఒక్కొక్క విద్యార్థికి కూడా లక్షలాది రుపాయలు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. మైనార్టీలకు శాది ముబారక్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వం అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తుందని ఆయన తెలిపారు. ఈ ప్రాంత మైనార్టీలు అందోల్ తెరాస అభ్యర్థి క్రాంతి కిరణ్‌కు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మైనార్టీల బడ్జెట్ నాలుగు వేల కోట్ల రుపాయలకు పెంచడం జరిగిందన్నారు. మైనార్టీలకు ప్రత్యేక నిధులు కెటాయించి గుర్తింపు ఇవ్వడం జరిగిందన్నారు. స్థానికుడైన క్రాంతికిరణ్‌కే మద్దతు ఇచ్చి గెలిపించుకోవాలని కోరారు. గతంలో హైదరాబాద్‌కే పరిమితమైన నాయకులను ఈ ప్రాంతం నుండి తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అందోల్ తెరాస అభ్యర్థి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత అన్ని వర్గాలు అన్ని కులాలను అభివృద్ది చేయడం జరిగిందన్నారు. స్థానికుడైన తనకు కేసీఆర్ సీటు కెటాయించినందున అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. గతంలో ఉన్న నాయకులందరు ఈ ప్రాంత అభివృద్ది కోసం కృషి చేయలేకపోయారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బిక్షపతి, జోగిపేట మార్కెట్ కమిటి చైర్మన్ నాగభూషణం, నాయకులు నారాయణ, జైపాల్, లక్ష్మీకాంతరెడ్డి, చాపల వెంకటేశం, లింగన్న, గోరె, లక్ష్మణ్, మైనార్టీలు తదితరులు పాల్గొన్నారు.
ఓటు వజ్రాయుధం లాంటిది
ఓటర్ల నమోదుకు మహిళా సమాఖ్య సభ్యులు సహకరించాలి
కలెక్టర్ హన్మంతరావు ఇస్మాయల్‌ఖాన్‌పేటలో అవగాహన ర్యాలీ
సంగారెడ్డి టౌన్, సెప్టెంబర్ 21: మహిళలు సమిష్టిగా ఉద్యమిస్తే ఏదైన సాధించగలరని, ఓటరు జాబితా రూపొందించడంలో మహిళా సమాఖ్య సభ్యులు సంఘటితంగా సహకరించాలని కలెక్టర్ ఎం.హన్మంతరావు పిలుపునిచ్చారు. శుక్రవారం సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేట గ్రామంలో ఓటరు నమోదుపై అవగాహాన కల్పించారు. గ్రామ మహిళా సమాఖ్య సభ్యులు, గ్రామ ప్రజలు, కళాకారులు, అధికారులతో కలిసి ర్యాలీ, మానవహారం చేపట్టారు. అర్హులైన వారందరిని ఓటరు జాబితాలో చేర్పిస్తామని అందరితో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధిలో మహిళల పాత్ర అమోఘమైందని పేర్కొన్నారు. 18యేళ్లు నిండిన వారందరిని ఓటరుగా నమోదు చేయించాలని, అర్హత ఉండి ఓటరు జాబితాలో లేనట్లయితే అలాంటి వారికి ఓటు విలువపై అవగాహాన కల్పించాలని సూచించారు. గ్రామంలోని బూత్ లేవల్ అధికారికి ఫారం-6 నింపి అవసరమై ప్రతులను అందజేసినట్లయితే జాబితాలో ఓటరుగా నమోదు చేస్తారని తెలిపారు. ఒక్కరికి ఒక ఓటు మాత్రమే ఉండాలని, ఒకే వ్యక్తి రెండు పోలింగ్ కేంద్రాలలో ఓటరుగా నమోదై ఉన్నట్లయితే సంబంధిత వ్యక్తులను గుర్తించి ఓటరు జాబితా నుండి తొలగించేందుకు సహకరించాలని కోరారు. ఓటు వజ్రాయుధం లాంటిదని, ఓటు హక్కు జన్మహక్కుగా భావించాలన్నారు. ప్రతి ఓటరు తమ ఓటుతో మంచి నాయకున్ని ఎంచుకునే అవకాశముంటుందని తెలిపారు. ప్రజలందరూ తమ పేరు ఓటరు లిస్టులో ఉన్నది లేనిది పరిశీలించుకోవాలన్నారు. ఓటరు నమోదుకు ఈ నెల 25వరకు మాత్రమే అవకాశముందని, ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామంలో అర్హత కలిగిన అందరూ వంద శాతం ఓటరుగా నమోదు కావాలని సూచించారు. కళాకారులు తమ పాటల ద్వారా ఓటు విలువ, ఓటు హక్కు, దేశ భవిష్యత్తును నిర్ణయించేది ఓటరేనంటూ సందేశాన్ని ఇస్తూ ప్రజలను చైతన్య పర్చారు. కార్యక్రమంలో డీఆర్వో వెంకటేశ్వర్లు, ప్రత్యేక అధికారి సుజాత, డిఆర్‌డిఓఒ ఏఓ సిద్దారెడ్డి, తహసీల్ధార్ విజయ్‌కుమార్, ఎంపీడీఓ జయలక్ష్మి, జెడ్పీటీసీ మనోహర్‌గౌడ్, ఈజిఎస్, రెవెన్యూ సిబ్బంది, మహిళా సమాఖ్య మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.
రాజ్యాంగం అమలు పట్టని నేతలు
- బీసీ సాధికారత సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయప్రసాద్
సిద్దిపేట టౌన్, సెప్టెంబర్ 21: రాజ్యాంగం సరైన దిశలో అమలు జరిగినపుడే సామాజిక న్యాయం జరుగగలదని బీసీ సాధికారత పేర్కొంది. శుక్రవారం బీసీ సాధికారత సంస్థ ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలోని ప్రెస్‌క్లబ్ బీసీల సమావేశానికి తుమ్మనపల్లి శ్రీనివాస్ అధ్యక్షత వహించగా సమావేశానికి ముఖ్యఅతిధిగా సంస్థ ప్రధాన కార్యదర్శి కస్తూరి జయప్రసాద్, గౌరవ అతిధులు మేధావుల ఫోరం రాష్ట్ర సమన్వయకర్త డా.టీవీ.రామనర్సయ్య, తెలంగాణ రజక ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు చిరుకలి శంకర్, సంస్థ నాయకులు తదితర ఇతర జిల్లా కుల సంఘాల బీసీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ ప్రధాన కార్యదర్శి కస్తూరి జయప్రసాద్ మాట్లాడుతూ రాజ్యాంగంపై ప్రమాణం చేసి చట్టసభలలో అడుగిడుతున్న ప్రజాప్రతినిధులు రాజ్యాంగం అమలు గురించి మరిచి పోవడమే కాకుండా రాజ్యాంగంలోని ఈ వర్గాల సమాన అవకాశాలు, హక్కులను ముఖ్యంగా మెజార్టీలు పాలించాలన్న సూచనలను ప్రజలకు వివరించడం లేదన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన దేశమని అంతకంటే గొప్పది మన రాజ్యాంగమన్నారు. ఉన్నవాడికి లేనివాడికి ఓటు అనే హక్కును కల్పించి రాజులుగా ప్రాతినిధ్యం పెంచుకోవాలన్నాది దాని పరమార్థమని, అయితే కొన్ని కులాలు మాత్రమే పాలకులుగా వ్యవహరిస్తు పాలకవర్గంగా మిగిలిపోతున్నారని ఇది ప్రజాస్వామ్యానికి మంచికాదన్నారు. బీసీ సాధికారత సంస్థ రాజ్యాంగం సరియైన దిశలో ప్రాముఖ్యతను తెలియజేస్తు ప్రజాయాత్ర పేరిట రాష్టవ్య్రాప్తంగా బస్సుయాత్రకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఈనెల 27వ తేది నుండి ప్రారంభమయ్యే ఈ యాత్ర మొదట 27వ తేదిన హైదరాబాద్ నుండి సిద్దిపేట మీదుగా కరీంనగర్ వేళ్తుందన్నారు. అదేరోజు సాయంత్రం కరీంనగర్‌లో భారీ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.