మెదక్

జగ్గారెడ్డి రాకతో వేడెక్కనున్న రాజకీయ వాతావరణం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, సెప్టెంబర్ 24: మనుషుల అక్రమ రవాణా అభియోగంపై విచారణ ఖైదీగా జైల్లో ఉన్న జగ్గారెడ్డికి సోమవారం సికింద్రాబాద్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో సంగారెడ్డి నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందస్తు ఎన్నికలు తన్నుకొస్తున్న తరుణంలో ఊహించని హఠాత్పరిణామాల మధ్య ప్రభుత్వ మాజీ విప్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని నగర పోలీసులు ఈ నెల 10వ తేదీన అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా విచారణ నిమిత్తం మూడు రోజుల పాటు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం బెయిల్ లభించడంతో జగ్గారెడ్డి జైలు నుండి నేరుగా గాంధీ భవన్‌కు చేరుకుని అక్కడి నేతలను కలుసుకున్న అనంతరం రాత్రికి సంగారెడ్డికి చేరుకున్నారు. ముందస్తు ఎన్నికల్లో పోటీ చేయబోతున్న తమ అభ్యర్థులను టీఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికే ప్రకటించగా అభ్యర్థులుగా చెప్పుకుంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నేతలు ఉన్నారు. టీఆర్‌ఎస్ దూకుడుకు చెక్ పెట్టాలంటే కాంగ్రెస్ అందుకు అనుగుణంగా వ్యూహరచనలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నేతలను భయాందోళనకు గురి చేసే అభియోగంపై జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేయగా, అందుకు ధీటైన సమాధానం ప్రజలకు చెప్పుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ నెలకొంది. తనపై మోపిన అభియోగాలపై నియోజకవర్గ ఓటర్లకు సంజాయిషీ ఇచ్చుకుంటూ టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు జగ్గారెడ్డి చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా అధికార టీఆర్‌ఎస్ పార్టీ గడచిన నాలుగేళ్ల మూడు నెలల పాలనలో ప్రజాసంక్షేమంపై విఫలమైన తీరును కూడా ఎండగట్టాల్సి ఉంటుంది. 2014 ఎన్నికల అనంతరం జగ్గారెడ్డి ఎక్కడ కూడా మిన్నకుండకుండా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, సిట్టింగ్ ఎమ్మెల్యే పని తీరును ఎండగడుతూ ప్రజలను చైతన్యం చేసే ప్రయత్నం చేసారు. సంగారెడ్డికి దక్కాల్సిన మెడికల్ కళాశాలను అక్రమంగా సిద్దిపేటకు తరలించుకుపోయారని పలు రకాలుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సంగారెడ్డి, సదాశివపేట మున్సిపల్ పట్టణాలకు చెందిన పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తే టీఆర్‌ఎస్ లాక్కుందనే విషయాన్ని ఎండగట్టారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి మున్సిపాలిటీలో నెలకొన్న తాగునీటి సమస్య, సింగూర్ నుండి మంజీర నీటిని అక్రమంగా తరలించుకుపోయిన విషయాలపై ప్రజలను జాగృతం చేసే కార్యక్రమాలు నిర్వహించారు. నిరుద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ విషయంలో కూడా ప్రభుత్వం విఫలమైందని, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్‌రావు, స్థానిక ఎమ్మెల్యేను తరుచుగా విమర్శిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో త్వరలో కొనసాగనున్న అసెంబ్లీ వార్‌లో జగ్గారెడ్డి తనపై వచ్చిన అపవాదును తొలగించుకుని ఓటర్లను కూడగట్టేందుకు పకడ్బందీ పథక రచనలు చేసుకోవాల్సి ఉంటుంది. టీఆర్‌ఎస్ పార్టీ ప్రచారం చేస్తూ నాలుగేళ్ల పాలనలో ప్రవేశపెట్టిన ప్రజాసంక్షేమ కార్యక్రమాలు, సాధించిన విజయాలతో ఊపుమీద కనిపిస్తోంది. గ్రామాల వారీగా వెళుతూ ఓటర్లతో ప్రతిజ్ఞ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఓటర్ల హామిలు పొందుతున్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మద్య మాటల యుద్దం తారాస్థాయికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.