మెదక్

అన్ని వర్గాల అభ్యున్నతికి సర్కార్ కృషి * దళితుల అభివృద్ధికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, సెప్టెంబర్ 24 : తెలంగాణ సర్కార్ అన్ని వర్గాల అభ్యున్నతి కోసం ప్రణాళిక బద్ధంగా కృషిచేస్తోందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఎస్సీల అభ్యున్నతికి తెలంగాణ సర్కార్ అవసరమగు అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. సోమవారం టీటీసీ భవన్‌లో షెడ్యుల్ క్యాస్ట్ చెందిన యువతి, యువకులకు ఎస్సీ డెవలఫ్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్ కృష్ణ భాస్కర్, మున్సిపల్ చైర్మన్ రాజనర్సులు జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగం అంటే ప్రభుత్వం ఉద్యోగాలు ఒక్కటే కాదని, సాంకేతిక పరమైన ఉపాధి మార్గాల్లో అనేక అవకాశాలున్నాయన్నారు. యువత టెక్నికల్ రంగంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం సాంకేతిక పరమైన శ్రామికుల కొరత వల్ల ఇతర రాష్ట్రాల నుండి మన రాష్ట్రానికి మానవ వనరులను దిగుమతి చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. సాంకేతిక రంగాల్లో సైతం అధిక వేతనాలు పొందుతున్నారన్నారు. షెడ్యుల్డ్ కులాల సాంకేతికరమై శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని అర్థికంగా అభివృద్ధి సాధించాలని కోరారు. జిల్లా కలెక్టర్ కృష్ణ్భాస్కర్ మాట్లాడుతూ ఉద్యోగాలు అంటే ఉపాధ్యాయుడు, డాక్టర్, పోలీసు, ఇంజనీర్ అనే అభిప్రాయంతో యువత ఉన్నారన్నారు. ఇవేకాకుండా సాంకేతిక వైపు యువత దృష్టి పెట్టాలని సూచించారు. ఈలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి ఎదగాలని యువతకు వెల్లడించారు. స్టేట్ మేనేజింగ్ డైరెక్టర్ లక్కిరాం భూక్యా మాట్లాడుతూ యువకుల ఉపాధి కొరకు 8ప్రాజెక్టు శిక్షణ సంస్థలు పాలుపంచుకున్నట్లు తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో నితైన్, అఫోలో, మెడీ స్కిల్స్, కెల్ట్రాన్ నిస్మీ, నిసిక్, ఆస్, హిమ్ తదితర సంస్థలు శిక్షణతోపాటు ఉపాధి కల్పిస్తాయన్నారు. శిక్షణ పొందిన వారు వ్యాపారం చేయాలనుకుంటే 50 లక్షల నుండి 1.5 కోట్ల వరకు రుణ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో 50 లక్షల వరకు సబ్సిడీ ఉంటుందన్నారు. ఈ అవకాశం శిక్షణ పొందిన వారికే వర్తిస్తుందన్నారు. సభకు అధ్యక్షత వహించిన మున్సిపల్ చైర్మన్ రాజనర్సు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి హరీష్‌రావు చొరవతో సిద్దపేటలో ఈకార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించినందుకు షెడ్యుల్ క్యాస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ లక్కిరాంభూక్యాకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి ఏంతగానో కృషిచేస్తుందన్నారు. ప్రాజెక్టు ట్రైనింగ్ పార్టనర్స్ కంపెనీలు సైతం ముందుకు వచ్చి, శిక్షణ నిచ్చి ఉపాధి కల్పించటం గొప్ప విషయమన్నారు. వివిధ రంగాల్లో శిక్షణ కోసం 1200 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ యాదయ్య, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి చరణ్‌దాస్, డీఆర్‌డీఎ పీడీ నవీన్‌కుమార్, దళిత సంఘాల నాయకులు శంకర్, గుర్రాల శ్రీనివాస్, పెద్దమాతరి బాబు, బీమాసేనా పాల్గొన్నారు.