మెదక్

అభివృద్ధికి పాటుపడ్డ కేసీఆర్‌ను ఆశీర్వదించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, నవంబర్ 13: గజ్వేల్ అభివృద్ధికి పెద్దపీట వేసిన సీఎం కేసీఆర్‌ను ఆదరించి ఆశీర్వదించాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం గజ్వేల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో రూ. 35వేల కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ది పనులు శర వేగంగా సాగుతుండగా, కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్ రెడ్డి గెలిస్తే తాము చేపట్టిన పనులకు సున్నం కూడా వేయలేరని ఎద్దేవా చేశారు. అయితే నియోజకవర్గానికి తాను చేసింది 25 శాతం మాత్రమేనని, మరోసారి గెలిపిస్తే 75 శాతం పనులు చేపట్టి దేశంలోనే గజ్వేల్‌ను ఆదర్శం గా తీర్చిదిద్దుతానని ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్ చెప్పిన మాటలను ఆయన గుర్తుచేశారు. రింగ్‌రోడ్డు, రైల్వేలైన్, సమీకృత ప్రభుత్వ భవనాల ఏర్పాటు, విజ్, నాన్‌విజ్ మార్కెట్, మహతీ ఆడిటోరియం, ఎడ్యుకేషన్‌హబ్ తదితర పనులు గజ్వేల్‌కు వనె్న తెస్తుండగా, మరో 8లేన్ల రహదారి మంజూరీ కావడంతో పారిశ్రామికంగా ముందుండేందుకు వీలు కలుగనుందని చెప్పారు. ఎన్నికల అనంతరం అర్హులైన పేదలందరికి డబుల్‌బెడ్ రూం ఇండ్లు కెటాయించనుండగా, ఇంకా మిగిలిపోయిన పేదలకు తాము కోరుకున్న స్థలంలోనే రూ. 5లక్షల వ్యయంతో ఇంటి నిర్మాణం చేపట్ట డానికి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అధికారం కోసం ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరని, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ తిరిగి అధికారం చేపట్టడం ఖాయమని వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావు, కార్పోరేషన్ చైర్మెన్‌లు భూంరెడ్డి, భూపతిరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్మెన్ అరుణ భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, టీఆర్‌ఎస్‌వీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, మండల టీఆర్‌ఎస్ బాద్యులు బెండ మదు, పీఏసీఎస్ చైర్మెన్ వెంకట్‌నర్సింహారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్‌లు డాక్టర్ యాదవరెడ్డి, టేకులపల్లి రాంరెడ్డి, జెడ్‌పీటీసీలు సింగం సత్తయ్య, వెంకట్‌గౌడ్, టీఆర్‌ఎస్ జిల్లా కార్యదర్శి ఊడెం కృష్ణారెడ్డి, బీసీసెల్ కార్యదర్శి ఆకుల దేవేందర్, నేతలు పొన్నాల రఘుపతిరావు, మాదవరావు, బొల్లారం శంకరయ్య, శ్రీనివాస్‌రావు, నాగేశ్వర్‌రావు, కిష్టయ్య, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.