మెదక్

రెండు వాహనాల మధ్య నలిగిన ఆటో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జహీరాబాద్, నవంబర్ 12: జహీరాబాద్ పట్టణ పరిధిలో జాతీయ రహదారిపై మిలన్ హోటల్ వద్ద ముందుగా వెళ్తున్న డీసీఎం, వెనుకనుంచి వస్తున్న లారీల మధ్యన చిక్కి నలిగిన ఆటో నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతిచెందగా, 8మంది ప్రయాణికులు తీవ్ర గాయాల పాలయ్యారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జహీరాబాద్‌నుంచి ధనాసిరి వెళ్తుండగా జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా 8మందికి గాయాల పాలయ్యారు. మృతుల్లో కోహీర్ మండలం మదిరికి చెందిన పెద్దగొల్ల సురేఖ(35), చిన్నారి నిప్సీ(3)లు మృతిచెందారు. గాయాల పాలైన వారిలో సంగారెడ్డికి చెందిన జ్యోతి(30), ఆర్యనగర్‌కు చెందిన సురేఖ(30), ఫరాన్‌బేగం (35), సదాశివపేటకు చెందిన సునితారాణి(33), సదాశివపేటకు చెందిన కుమార్(45), ధనాసిరికి చెందిన జకియాబేగం(35), హుస్సేన్ బీ, చెన్నారెడ్డి నగర్‌కు చెందిన సరళ(50) ప్రమాదంలో గాయాలపాలైన సురేఖ పరిస్థితి విషమంగా ఉండటంతో గాంధీకి తరలించారు. ఆమె తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు. ఆమె అంత్యక్రియలు మదిరిలో నిర్వహించారు. ఆమె అంత్యక్రియలకు స్థానికులు, బంధువులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కాగా సంఘటన వివరాలు తెలిసిన వెంటనే ఎమ్మెల్సీ ఎండీ.్ఫరీదుద్ధీన్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ జే.గీతారెడ్డిలు హుఠాహుఠిన ఆసుపత్రికి చేరుకున్నారు. క్షతగాతృలతో మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులను పరమార్శించారు. ఆవసరమైన వారికి వెంటనే హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతిచెందన విషయం తెలుసుకుని ఆవేదన వ్యక్తంచేస్తూ, మృతుల కుటుంబ సభ్యులను పరమార్శించారు. మెరుగైన వైద్యసేవలు అందించేందుకు తమవంతు చర్యలు తీసుకుంటామని క్షతగాతృలకు, వారి కుటుంబ సభ్యులకు చెప్పారు. ఈ విషయమై వైద్యులతో ముచ్చటించి అవసరమైన సేవలు అందించాలన్నారు. ఆయనతోపాటు ఎంజీ.రాములు, నారాయణ ఇతర నాయకులున్నారు. ఈ సందర్భంగా గీతారెడ్డి విలేఖర్లతో మాట్లాడుతూ సంఘటన వివరాలను వెల్లడిస్తూ ఆటో డ్రైవర్లు అప్రమత్తంగా వాహనాలు నడపాల్సిన అవసరాన్ని సూచించారు.