మెదక్

విద్యాధరి క్షేత్రంలో వైభవంగా మూలా నక్షత్ర సంబురాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, డిసెంబర్ 9: తెలంగాణ జిల్లాల్లో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న వర్గల్ విద్యాధరి క్షేత్రంలో ఆదివారం అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖరశర్మ సిద్దాంతి మూల ఉత్సవానికి అంకురార్పన చేయగా, అమ్మవారికి విశేష పూజలు, ప్రత్యేక అలంకరణ, చతుషష్ట్యు పచార పూజలు, చంఢీహోమము, చప్పన్‌బోగ్ నివేదన, లక్ష పుష్పార్చన తదితర కార్యక్రమాలు భక్తులను కనువిందు చేశాయి. ముఖ్యంగా మూల ఉత్సవం సందర్బంగా భక్తులు విశేష సంఖ్యలో తరలిరాగా, ఆలయాల సముదాయం అమ్మవారి నామస్మరణతో మార్మోగింది. అలాగే లక్ష పుష్పార్చనలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనగా, ఆలయంలో నిర్వహించిన ఆద్యాత్మిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఆలయ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలతోపాటు మహాప్రసాదం అందజేయగా, ఈ కార్యక్రమాల్లో ఆలయ కమిటీ చైర్మెన్ పొద్దుటూరి నర్సింహరావు, మాజీ చైర్మెన్ దాచెపల్లి వెంకటకృష్ణ, కార్యదర్శి బొమ్మిడాల సత్యనారాయణ, వివిద అనుబంద సంస్థల బాద్యులు గంగిషెట్టి సుదాకర్, ఇర్రి మల్లారెడ్డి, నూకా బిక్షపతిగుప్త, అత్తెల్లి బాపిరాజు, రేణిగుంట శ్రీనివాస్, వెంకట్‌రాంరెడ్డి, శ్రీరాంరంగయ్య, కైలాస శ్రీనివాస్, టేకులపల్లి బాల్‌రెడ్డి, దోసపాటి లక్ష్మణ్‌రావు, ఆలయ వేద పండితులు అనంతగిరిశర్మ, శశిధరశర్మ, నాగరాజశర్మ, ప్రవీన్‌కుమారశర్మ, గణేష్‌శర్మ, రామశర్మ, వంశీశర్మ తదితరులు పాల్గొన్నారు.
మల్లన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
చేర్యాల, డిసెంబర్ 9: ప్రముఖ శైవక్షేత్రమైన కొమురవెళ్ళి మళ్లికార్జున స్వామి సన్నిధికి భక్తులు ఆదివారం పోటెత్తారు. వరుస సెలవు దినాలు రావడంతో శనివారం సాయంత్రానికే భక్తులు పెద్ద సంఖ్యలో కొమురవెళ్ళికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం కళ్యాణ కట్ట వద్ద తలనీలాలు సమర్పించుకొని కోనేరులో స్నానమాచరించారు. అనంతరం గంగరేని చెట్టు, ముఖ మంటపం వద్ద పంచ రంగులతో ఒగ్గు పూజారుల డమరుఖ నాధాల మధ్య పట్నాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. ఆ తరువాత గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడి గొల్లకేతమ్మ, బలిజ మేడలమ్మలతో కొలువైన కొంరెళ్లి మల్లన్నను దర్శించుకొని తమ కుటుంబాలను చల్లంగా చూడాలని వేడుకున్నారు. ఆ తర్వాత మహిళలు వారు భస చేసిన ప్రాంతాల వద్ద బోనాలు వండుకొని వాటిని నెత్తిన పెట్టుకొని నృత్యాలు చేస్తూ కొండపై కొలువైన ఎల్లమ్మ తల్లి సన్నిదికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలను సమర్పించుకొని కల్లును ఆరగింపుగా చూపి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వారి సన్నిధికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు దేవస్థాన ఈవో కంతశాల వెంకటేష్ తెలిపారు. ఈ నెల 30న స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుందని, దీనికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కల్యాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు.