మెదక్

గజ్వేల్‌లోని విద్యాసౌదంలో రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, ఫిబ్రవరి 15: గజ్వేల్ ఎడ్యుకేషన్‌హబ్‌లో మార్చి 2వ తేదీన రసాయన శాస్త్ర విభాగం ఆద్వర్యంలో రాష్టస్థ్రాయి వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం గజ్వేల్‌లోని ఎడ్యుకేషన్‌హబ్‌లో కార్యశాల సమాచారపత్రం ఆవిష్కరించిన సందర్బంగా ఆయన మాట్లాడారు. కర్బన సమ్మేళనాలు, వర్ణపట విశే్లషణ అనే అంశంపై ఒకరోజు రాష్ట్ర స్థాయి కార్యశాల జరగనుందని, ఈ కార్యక్రమానికి కలెక్టర్ కృష్ణ్భాస్కర్, గడా అధికారి ముత్యంరెడ్డి హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. కలెక్టర్, గడా అధికారి వర్గల్ మార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ల సహకారంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో రసాయన శాస్త్రానికి సంబందించిన విద్యావేత్తలు, ప్రముఖులు, విద్యార్థులు హాజరు కానుండగా, ఐఐసీటీ శాస్తవ్రేత్త సురేశ్‌బాబు ముఖ్య అతిథిగా పాల్గొంటారని చెప్పారు. అలాగే విశిష్ట అతిథిగా ఐఐసీటీ కార్పోరేట్ ఎఫైర్స్ సీనియర్ కన్సల్టెంట్ రవికిరణ్ హాజరు కానుండగా, కార్యక్రమానికి చైర్మెన్ గా తాను వ్యవహరించనుండగా, రసాయనశాస్త్ర అద్యాపకులు సౌందర్య సమన్వయకర్తగా వ్యవహరిస్తారని చెప్పారు. కార్యక్రమంలో వర్క్‌షాప్ సమన్వయ కర్త డాక్టర్ అడవిరాజు, వైస్‌ప్రిన్సిపాల్ డాక్టర్ హుస్సేన్, అకాడమిక్ కో-అర్డినేటర్ డాక్టర్ గోపాలసుదర్శనం, ఐక్యూఏసీ కో- అర్డినేటర్ కుమారస్వామి, సీనియర్ అద్యాపకులు రమేశ్‌బాబు, అయోద్యా రెడ్డి, నర్సింలు, తెలుగుశాఖ అధ్యక్షులు డాక్టర్ చెప్పెల హరినాథశర్మ, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
క్రమ శిక్షణతో ప్రవర్తనలో మార్పు వస్తుంది
- కమిషనర్ జోయల్‌డీవిస్
నంగునూరు, ఫిబ్రవరి 15: ప్రతి ఒక్కరు క్రమ శిక్షణతో ఉండి శిక్షణాకార్యాక్రమాన్ని పూర్తి చేస్తే మనిషి ప్రవర్తనలో మార్పు వస్తుందని సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్‌డేవిస్ అన్నారు. ఫైర్ ప్రాక్టీస్ కార్యక్రమంలో భాగంగా నంగునూరు మండలం రాజగోపాల్‌పేట పోలీసు స్టేషన్‌లో ఫైరింగ్ ప్రాక్టీస్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా 9 ఎం ఎం పిస్టల్, కార్బన్ వెపన్స్‌లతో ఫైరింగ్ చేశారు. ఈ సందర్భంగా ఫైరింగ్ చేస్తున్న సిబ్బందిని పరిశీలించారు. సిబ్బంది ఫైరింగ్ నందు 9 ఎంఎం పిస్టల్, కార్బన్, , ఏకే47, ఎస్‌ఎల్‌ఆర్, వెపెన్స్‌ద్వారా ఫైరింగ్ చేయించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ ఈ శిక్షణ ద్వారా సిబ్బందికి ప్యూహాత్మక నైపూణ్యం మెరుగు పడుతుందన్నారు. దీంతో పోలీసులు ఆత్మ విశ్వాసంతో విధులు నిర్వర్తించే వీలు కలుగుతుందన్నారు. సమీపంలో నుండి ప్రత్యర్థుని ఎదుర్కోవడం, ముష్కరులను నిరాయుధులుగా చేయడం, ఫ్యూహాత్మకంగా మారి వారితో తల పడటం జరుగుతుందన్నారు. అలాగే ఫస్ట్‌ఏయిడ్, వారిపై నిఘా వేయడం, సాఫ్ట్ స్కిల్ వంటి వాటిల్లో పోలీసులకు శిక్షణ ఇవ్వడం ఇరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో పని చేసి సేవలందించినప్పుడే ప్రజలు మనల్ని గుర్తుంచుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి, ఏఆర్ డీసీపీ బాపురావు, ట్రైనీ ఐపీఎస్ శబరీష్, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, ఏర్ సిబ్బంది పాల్గొన్నారు.

విద్యార్థులకు చేయూత అందిస్తాం
నంగునూరు, ఫిబ్రవరి 15: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆర్థిక చేయూతనివ్వడంలో ఆసోసియేషన్ ఆఫ్ అలయన్స్ ఇంటర్నేషనల్ క్లబ్ సిద్దిపేట ముందుంటుందని క్లబ్ గవర్నర్ ఆత్మ రాములు ఆన్నారు. శుక్రవారం నాడు నంగునూరు మండల పరిధిలోని మగ్దుంపూర్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు కొండ వెంకటేశం ఆందించిన ఆర్థిక సహాయంతో పరీక్షా సమాగ్రిని , తల్లిదండ్రులు లేని విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ను అందించారు. ఈ సందర్భంగా క్లబ్ గవర్నర్ ఆత్మారాములు మాట్లాడుతూ తమ క్లబ్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఆనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు ఎదుగాలని అనంతరం సేవాకార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని తెలిపారు. అనంతరం విద్యార్థులకు ఆర్థిక సహాయం చేసిన వెంకటేశంను పాఠశాల తరుపున ఘనంగా సాన్మానించారు. ఈ కార్యాక్రమంలో ఉపాధ్యాయులు లక్ష్మారెడ్డి, ప్రసన్న, రాజ్యలక్ష్మీ, ఎల్లం, రమేశ్, మంజుల, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
పీఎం కిసాన్ అర్హులైన అన్నదాతల ఎంపిక
కౌడిపల్లి, ఫిబ్రవరి 15. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం రైతులకు ఆర్థిక ప్రయోజనాన్ని కలిగిస్తుందని మండల వ్యవసాయ అధికారిణి పద్మావతి అన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హులను ఎంపిక కార్యక్రమం రెండో రోజైన శుక్రవారం మండలంలోని పాంపల్లి, భుజిరంపేట, నాగ్సాన్‌పల్లి గ్రామాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో స పద్మావతి మాట్లాడుతూ భుజిరంపేట గ్రామంలో 462 మంది 5 ఎకరాలలోపు రైతులు ఉండగా 86 మంది రైతుల భూముల వివరాలు అసంపూర్తిగా ఉన్నాయని , ముగ్గురు మృతి చెందారని, నాగ్సాన్‌పల్లిలో 78 మంది రైతులు ఉండగా అందరి రైతుల భూవివరాలు సక్రమంగా ఉన్నాయని, పాంపల్లి గ్రామంలో 34 మంది రైతులు ఉండగా 33 మంది అర్హులుగా గుర్తించడం జరిగిందని ఓక్క రైతు అనర్హుడుగా గుర్తించినట్లు ఆమె తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రయోజనాలను రైతులకు వివరించారు. 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులను కేంద్రం సూచించిన మార్గదర్శకాలగనుణంగా ఎంపిక ప్రకియ చేపినట్లు తెలిపారు.
ఈ పథకం ద్వారా 5ఎకరాలలోపు రైతులకు మేలు చేకూరుతుందన్నారు. సంవత్సరానికి 6వేల రుపాయలు మూడు విడుతలుగా రైతుల ఖాతాలో జమచేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే సంబంధిత శాఖ కార్యాలయంలో 5 ఎకరాలలోపు వ్యవసాయ భూమి ఉన్న వారి వివరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. లబ్దిదారుల వివరాలను జిల్లా వ్యవసాయశాఖ ఆదేశాల అనంతరం ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామన్నారు. ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, రైతు సమన్వయసమితి అధ్యక్షులు, రైతులు పాల్గొన్నారు.
వెల్దుర్తి మండల విఆర్‌ఏల సంఘం
అధ్యక్షుడిగా పోచయ్య
వెల్దుర్తి, ఫిబ్రవరి 15: వెల్దుర్తి మండల విఆర్‌ఎల సంఘం అధ్యక్షుడిగా చెర్లపల్లికి చెందిన తిక్కల పోచయ్యను ఏకగ్రీవంగాఎన్నుకొవడంజరిగిందని కమిటి సభ్యులు శుక్రవారం నాడు విలేఖరులకు తెలియజేశారు. కమిటిసభ్యులుగాఉప్పల రమె ష్, ఆకులపోచ య్య, సహయక కార్యదర్శి సత్తయ్య,బిక్షపతి, యాదగిరి బాలేశ్, స్వామి, సత్తయ్య, రాంచందర్, నర్సింలు, గౌరవ అధ్యక్షులు శ్రీనుల ఎన్నుకొవడం జరిగిందన్నారు.

10వ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తాం

మెదక్, ఫిబ్రవరి 15: మెదక్ తెలంగాణ రాష్ట్ర బాలికల గురుకుల పాఠశాలలో అత్యంత ప్రాధాన్యతను క్రీడల్లో ప్రదర్శించడమే కాకుండా చదువుల్లో కూడా ముందంజలో ఉన్నామని పాఠశాల ప్రిన్సిపల్ పర్వతవర్దిని శుక్రవారం మాట్లాడుతూ తెలిపారు. ఈ సంవత్సరం 10వ తరగతి చదువుతున్న 80 మంది కూడా వంద శాతం ఉత్తీర్ణత సాధించానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. 2019లో ఇంటర్ ప్రారంభం అయినట్లు తెలిపారు. ఇందులో ఎంపీసీ 29, బైపీసీ 34 మంది ఉన్నట్లు తెలిపారు. రాత్రి 9 గంటలకు 10వ తరగతి విద్యార్థులకు టీ, స్నాక్స్ ఇస్తున్నామని, ఉదయం బూస్ట్, గుడ్డు ఇస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు సీజనల్ పండ్లు ఇస్తున్నట్లు తెలిపారు.
విద్యార్థులకు ట్యూషన్ చెబుతున్న ఉపాధ్యాయులు హాస్టల్‌లోనే నిద్రిస్తూ విద్యార్థులను తెల్లవారుజాము నాలుగున్నర గంటలకు లేపి ట్యూషన్ చెబుతున్నట్లు తెలిపారు. వంద శాతం ఈ సంవత్సరం 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధిస్తామని ప్రిన్సిపల్ ప్రకటించారు. డైట్ ప్రిన్సిపల్ రమేశ్ 10వ తరగతి విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. మెదక్ జిల్లాలో పరీక్షా కేంద్రాలు 67 ఉండగా రెసిడెన్షియల్ స్కూల్స్‌లో పరీక్షా కేంద్రాలు నిర్వహించవద్దని ప్రభుత్వం నుండి శుక్రవారం ఉత్తర్వులు వచ్చాయని విద్యాశాఖ అధికారి భాస్కర్ తెలిపారు.
* క్రీడలలో అత్యున్నత స్థాయికి ఎదిగిన గురుకుల బాలికల
రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఇటీవల జరిగిన క్రీడా పోటిల్లో జాతీయ స్థాయి క్రీడలకు 11 మంది ఎంపికయ్యారని ప్రిన్సిపల్ పర్వతవర్దిని, పీఈటీ ప్రభుదయచరణ్ మాట్లాడుతూ తెలిపారు. తిరుపతిలో జరిగిన అథ్లెటిక్ పోటిల్లో శ్రావ్య, ఒలిలా అనే ఇరువురు రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో గెలుపొంది జాతీయ స్థాయికి ఎంపికయ్యారన్నారు. రబ్బీ అండర్-19 కేరళలో జరిగిన ఈ క్రీడలలో రజిత రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో గెలిచి జాతీయ స్థాయికి ఎంపికైనట్లు తెలిపారు. ప్లోర్ బాల్‌లో అండర్-19 తనుజా చత్తీస్‌గడ్‌లో రాష్ట్ర స్థాయిలో గెలిచి జాతీయ స్థాయికి ఎంపికయ్యారని, కరాటే యూనిఫెడ్‌లో హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన క్రీడలలో లక్ష్మీ సుప్రజ విజయం సాధించి జాతీయ స్థాయికి ఎంపికైంది. యంగ్‌ముడో అండర్-14లో 8వ తరగతి చదువుతున్న లావణ్య, నవీన, 9వ తరగతి పూజ, నిఖిత గోల్డ్‌మెడల్ సాధించినట్లు తెలిపారు. యోగాలో నందిని రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానంలో గెలుపొంది జాతీయ స్థాయికి ఎంపికైనట్లు తెలిపారు. వివిధ క్రీడల్లో మెదక్ గురుకుల పాఠశాల నుండి విజయం సాధించారని వారు తెలిపారు. ఈ పాఠశాలకు క్రీడలలో మంచి పేరు సాధించి జాతీయ స్థాయికి ఎదిగిన విద్యార్థినీలను ప్రిన్సిపల్ పర్వతవర్దిని అభినందించారు. ఈ క్రీడల్లో శక్తివంచన లేకుండా కృషి చేసి బాలికలను జాతీయ స్థాయికి ఎదిగేందుకు కృషి చేసిన పీఈటీ చరణ్‌ను ఆమె అభినందించారు.

ప్రతి ఒక్కరిపై అమ్మవారి సంపూర్ణ ఆనుగ్రహం ఉండాలి

గజ్వేల్, ఫిబ్రవరి 15: ఆదిపరాశక్తి, జగన్మాత ప్రతిరూపమైన శ్రీ రేణుకా మాత దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని శ్రీ క్షేత్రం పీఠాధిపతి శ్రీ మదుసూదనానంద తీర్థ స్వామీజి ఉద్భోదించారు. శుక్రవారం గజ్వేల్ పట్టణ శివారులో శ్రీ రేణుకామాత విగ్రహ ప్రతిష్ట మహోత్సవ అంకురార్పన కార్యక్రమంలో పాల్గొని భక్తులనుద్దేశించి ఆయన అనుగ్రహ భాషనం చేశారు. భక్తి ప్రపత్తులు, నియమనిష్టలతో అమ్మవారిని పూజిస్తే సంపూర్ణ అనుగ్రహం ఉంటుందని, పుణ్య కార్యక్రమాలు, భగవన్నామ స్మరణతో మానసిక ప్రశాంతత దక్కుతుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా పండితుల వేద మంత్రాల మద్య ప్రతిష్టించబడుతున్న రేణుకామాత అత్యంత శక్తివంతమైన అమ్మవారిగా ప్రసిద్దికెక్కి భక్తుల పాలిట దైవంగా విలసిల్లుతుందని పేర్కొన్నారు. గ్రామ దేవతలను అభిషేకించడం, పూజించడంతోనే ప్రజలు సుఖశాంతులతో సంతోషంగా ఉంటారని, పాడిపంటలు సంవృద్ధిగా పండుతాయని, పిల్లాపాపలతో ప్రతి ఒక్కరూ సుఖ జీవనం గడుపుతారని అన్నారు. అయితే రేణుకామాత విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో కంకణధారన చేసుకున్న భక్తులు జీవితాంతం నియమనిష్టలతో ఉంటూ అమ్మవారి సేవకు అంకిత మవ్వాలని, హిందూ సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ ముందుండాలని ఆకాంక్షించారు. పురాతన ఆలయాల అభివృద్ది, నూతన క్షేత్రాల నిర్మాణానికి సహకరిస్తున్న, కృషి చేస్తున్న ప్రతి ఒక్కరిపై పరమేశ్వరుడి కృప ఉండడంతో పాటు ప్రతిష్టా మహోత్సవ ఫలాలు దక్కుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు చంద్రకాంతశర్మ, రాజశేఖరశర్మ, నిర్వాహకులు దేవేందర్‌గౌడ్, రాజు గౌడ్, గణేష్‌గౌడ్, రమేశ్‌గౌడ్, అశోక్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.