మెదక్

డిఐజిగా అకున్ సబర్వాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, మే 27: హైదరాబాద్ రేంజ్ డిఐజి అకున్ సబర్వాల్‌కు నిజామాబాద్, మెదక్ రేంజ్ డిఐజిగా ప్రభుత్వం అధనపుబాధ్యతలు అప్పగించిన మేరకు శుక్రవారం నాడాయన బాధ్యతలు తీసుకున్నారు. 2001 ఐపిఎస్ బ్యాచ్‌కు చెందిన అకున్ సబర్వాల్ ఆల్ ఇండియాలో 33వ ర్యాంకు సాధించి 2004 సంవత్సరంలో మొదటి సారిగా ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు వచ్చారు. వచ్చిరాగానే అనంతపూర్ జిల్లా ఎఎస్పీగా విధులు నిర్వహించారు. 2006-07లో వరంగల్ జిల్లా ఓఎస్‌డిగా, 2007 నుండి 2009 వరకు విశాఖపట్టణం ఎస్పీగా పని చేశారు. అనంతరం హైదరాబాద్ సెంట్రల్ డిసిపిగా, హైదరాబాద్ దక్షిణ మండలం డిసిపిగా, ఎసిబి హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్‌గా, ఆర్మిడ్ పోలీస్ కమాండెంట్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్‌విపి నేషనల్ పోలీస్ అకాడమి హైదరాబాద్‌లో పని చేశారు. 2015 ఎప్రిల్‌లో డిఐజిగా పదోన్నతి పొంది డైరెక్టర్ డ్రగ్స్ కంట్రోల్ అడ్‌మినిస్ట్రేషన్ తెలంగాణ స్టేట్, అదనపు డైరెక్టర్ ఎక్సైజ్ కమిషనర్, రిజిస్ట్రార్ ఫార్మసి, ట్రిబ్యునల్ తెలంగాణ స్టేట్‌లో పని చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ రేంజ్‌తో పాటు అదనంగా నిజామాబాద్, మెదక్ రేంజ్ డిఐజిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెల్లడించింది. అకున్ సభర్వాల్ సతీమణి స్మిత సభర్వాల్ గతంలో మెదక్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు.