మెదక్

గ్యాస్ కనెక్షన్‌లు తీసుకోకుంటే రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ రూరల్, మే 27: గ్యాస్ కనెక్షన్‌లు మంజూరైనవారు పది రోజుల్లో తీసుకోకపోతే రద్దు చేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటరామరెడ్డి హెచ్చరించారు. లబ్ధిదారుల ఇళ్లకు మంజూరు పత్రంతోపాటు తీసుకోకపోతే రద్దుచేస్తామని తెలుపుతూ నోటీసులు అతికించాలని ఎంపిడిఓలు, తహశీల్దార్లను ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఎంపిపి కార్యాలయంలో మంజూరైన గ్యాస్ కనెక్షన్‌ల గ్రౌండింగ్‌పై తహశీల్దార్‌లు, ఎంపిడిఓలు, గ్యాస్ ఎజెన్సీల నిర్వాహకులతో సమీక్షించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ డివిజన్‌లో 22 వేల 388 గ్యాస్ కనెక్షన్‌లు మంజూరయ్యాయన్నారు. ఇందులో ఇప్పటివరకు 10 వేల 621 మాత్రమే గ్రౌండ్ అయ్యాయని, మిగతావి 11 వేల 767 చేయాల్సి ఉందన్నారు. జిల్లా పౌర సరఫరాల అధికారి సమీక్షించకుండా నిర్లక్ష్యంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మంజూరైన తీసుకోనివారికి నోటీసు అందజేసి పది రోజుల్లో తీసుకోకపోతే రద్దుచేసి కొత్తవారికి మంజూరుచేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. నోటీసులు తెలుగులో ముద్రించి అతికించాలన్నారు. గ్రామాలలో విఆర్‌ఓలు, పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షించాల్సిందిగా సూచించారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. యెల్దుర్తి, జోగిపేట గ్యాస్ ఎజెన్సీలను ఈ నెల 30న తనిఖీచేసి అవసరమైతే సీజ్ చేయాలని డిఎస్‌ఓను జెసి ఆదేశించారు. ప్రతి రోజు రద్దు, మంజూరు, గ్రౌండింగ్ రిపోర్టు తనకు పంపాలని ఎఎస్‌ఓలకు సూచించారు. సరైన సమాచారం లేకుండా సమీక్షకు వచ్చిన నర్సాపూర్ డిటిపై జెసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపిడిఓలు, తహశీల్దార్‌లు సంయుక్తంగా గ్యాస్ కనెక్షన్‌ల పురోగతిలో పాలుపంచుకోవాలన్నారు. మళ్లీ శుక్రవారం సమావేశంలో అవసరమైన కొత్త మంజూరు చేస్తామన్నారు. ఈ సమావేశంలో డిఎస్‌ఓ అనురాధ, ఆర్‌డిఓ నగేశ్, మున్సిపల్ కమీషనర్ ప్రసాద్, గ్యాస్ కంపెనల ప్రతినిధులు పాల్గొన్నారు.