మెదక్

ప్రతి క్షణం అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుల్కల్, జూన్ 17: ప్రజలతో స్నేహపూరితంగా వ్యవహరిస్తూ న్యాయం జరిగేలా ప్రతి పోలీస్ అధికారి వ్యవహరించాలని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం పుల్కల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మీకంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. కింది స్థాయి అధికారులు ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తూ ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు.
అనంతరం సుల్తాన్‌పూర్ జెఎన్‌టియు కళాశాలను సందర్శించి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. స్థానికుల కోరిక మేరకు కళాశాలకు పరిసరాల్లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సిబ్బందిని నియమిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జోగిపేట సిఐ వెంకన్న, ఎస్‌ఐ సత్యనారాయణ పాల్గొన్నారు.