మెదక్

అధిక దిగుబడులకు తోడ్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, జూన్ 17: చెరుకు రైతులు ఆదునీక పద్దతులు పాటించి అధిక దిగుబడులు సాధించే దిశగా తగు చర్యలు తీసుకుంటున్నట్లు సిడిసి చైర్మన్ విజయేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సిడిసి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెరుకు సాగుపై విజ్ఞాన యాత్రలు నిర్వహించి రైతుల్లో అవగాహాన పెంచుతామన్నారు. చెరుకు నరికే యంత్రాలు, మినీ ట్రాక్టర్లు 60శాతం సబ్సిడీతో అర్హులైన రైతులందరికి అందజేయనున్నట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదాలు, పాముకాటుకు గురై మృతి చెందిన రైతులు, కూలీలకు ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుందన్నారు. గడ్డి మందులు, పురుగుల మందులు, ఆర్‌సిసి పైపులు, సోలార్ పెన్షింగ్, నాగళ్లు తదితర వాటిని అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సిడిసి డైరెక్టర్లు పాల్గొన్నారు.