మెదక్

ఫిట్‌నెస్ లేని వాహనాలు సీజ్ చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూన్ 17: పాఠశాలల బస్సులను తప్పక ఫిట్‌నెస్ చేయించుకోవాలని, ఫిట్‌నెస్‌లేని బస్సులను సీజ్ చేస్తామని సిద్దిపేట ఆర్టీఓ ఏసురత్నం అన్నారు. స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో విద్యాసంస్థల బస్సు డ్రైవర్లు, యాజమాన్యాలతో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. మద్యం సేవించే డ్రైవర్లను నియమించొద్దని సూచించారు. ఫిట్‌నెస్‌లేని వాహనాల డ్రైవర్ల లైసెన్స్‌లు 3నెలలపాటు సస్పెండ్ చేస్తామన్నారు. ఆ వాహన యజమానుల పై పోలీసు కేసులు నమోదు చేస్తామన్నారు. వాహనాల వెంట సహాయకులు తప్పక ఉండాలన్నారు. విద్యార్థులు భావిభారత పౌరులని, వారి ప్రాణాలకు హానికలుగకుండా, ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త, బాధ్యత అందరి పై ఉందన్నారు. గతంలో జరిగిన ప్రమాదాలు వివరించారు. ఏ పొరపాట్ల వల్ల నష్టం జరిగిందో తెలుపుతూ ఇలాంటి ప్రమాదాలు కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 5ఏండ్ల అనుభవం, లైసెన్స్ హెచ్‌సివి కలిగి ఉండి మంచి క్యారెక్టర్ కలిగి ఉన్న వారిని మాత్రమే విద్యాసంస్థలు తీసుకోవాలన్నారు.