మెదక్

రైతుల భూములతో.. భూదందా తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, జూన్ 17: భూ సేకరణ పేరుతో సర్వం కోల్పోతున్న రైతులు జీవించేది ఎలాగని, భూ నిర్వాసితులకు 2013 చట్ట ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలని మాజీ ఎంపి సోలిపేట రాంచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ముందు భూ నిర్వాసితులు చేపట్టిన నిరవధిక నిరహారదీక్షలను శుక్రవారం సోలిపేట రాంచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పదవి రాక ముందు ఒక మాట పదవి వచ్చిన తరువాత ఒక మాట మాట్లాడే పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. పదవులు ఉన్నా లేకున్న కమ్యునిస్టులు ప్రజల మద్యలో ఉంటూ సమస్యలపై పోరాటం చేస్తారన్నారు. ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదని ప్రజల ఆమోదం లేకుండా వారి భూములను లాక్కోవడం దారుణమన్నారు. చట్టం ఎవరి చుట్టం కాదని, చట్టానికి అందరు కట్టుబడక తప్పదన్నారు. మల్లన్నసాగర్, నిమ్జ్, ఘనపురం ఆయకట్టల పేరుతో ప్రభుత్వం 12600 ఎకరాల భూమిని సేకరిస్తుందన్నారు. ముందుగా గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేయకుండా, యజమానుల ఆమోదం లేకుండా భూములను తీసుకోవడం ఎంత వరకు సమంజసమన్నారు. పోలీసుల పికేటింగ్‌లకు రైతులు భయపడరని, ఇది నైజమ్‌ను తరమికొట్టిన గడ్డ అని కెసిఆర్ గుర్తించుకోవాలన్నారు. గత ప్రభుత్వాలు అప్పటి పరిస్థితులను బట్టి రేట్లు కట్టిచ్చాయని, ఇప్పుడు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా భూముల రేట్లు పెరుగుతున్నాయన్నారు. 2013 భూ సేకరణ చట్టాన్ని పక్కన పెట్టి అక్రమంగా 123 జివోను తీసుకొచ్చి బలవంతంగా భూములను లాక్కుంటున్నారని మండిపడ్డారు. రైతులు చేస్తున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. కార్యక్రమంలో భూ నిర్వాసితుల పోరాట కమిటి జిల్లా కన్వీనర్ జి.జయరాజ్ పాల్గొన్నారు.