మెదక్

విద్యాహక్కు చట్టం అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట టౌన్, జూన్ 17: ప్రైవేటు విద్యా వ్యవస్థల్లో విద్యాహక్కు చట్టం అమలు కావడం లేదని, యాజమాన్యాలు వ్యవహరిస్తున్న వైఖరిపై అధికారులు చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల ఐకాస నేతలు డిమాండ్ చేశారు. గురువారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో విద్యాహక్కు చట్టం అమలు చేయాలని ముద్రించిన కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐకాస అధ్యక్షుడు చంద్రం మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన విద్యాహక్కు చట్టాన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు భ్రస్టుపట్టించాయన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ పేద విద్యార్థులకు 25శాతం ఉచితంగా విద్యను అందించాల్సిన ప్రైవేటు విద్యాసంస్థలు అందించడం లేదన్నారు. విద్యాహక్కు చట్టం అమలు చేయకుండా అధిక ఫీజులు దండుకుంటున్నారని ఆరోపించారు. విద్యాహక్కు చట్టం అమలవుతున్న వివరాలు స్కూల్ నోటిసుబోర్డుపై పొందుపర్చాలన్నారు. విద్యాహక్కు చట్టం కచ్చితంగా అమలు పర్చాలన్నారు. లేదంటే ఐకాస ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.