మెదక్

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, జూలై 2: వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే సైనికులని, సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజావ్యతిరేక పాలనపై ప్రజల వద్దకు తీసుకువెళ్లి పార్టీకి పూర్వవైభం తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. శనివారం సంగారెడ్డిలోని పిఎస్‌ఆర్ గార్డెన్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థల ప్రతినిధుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులు, పూడిక తీతల పేరిట రాష్ట్రంలో కోట్లాది రూపాయలు నిధులు దుర్వినియోగమవుతున్నాయని అన్నారు. ఇలాంటి విషయాలపై ప్రజలకు వివరించి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పించాలన్నారు. కార్యకర్తల ముందుండి నడిపించిన వారే నిజమైన నాయకుడని అన్నారు. పని చేసే ప్రతి కార్యకర్తకు పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందన్నారు. కెసిఆర్ నేతృత్వంలో కొనసాగుతున్న పాలనలో అభివృద్ధి అనేది కేవలం గజ్వేల్ నియోజకవర్గానికే పరిమితమైందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఇతర ప్రజాప్రతినిధులంతా నిమిత్త మాత్రులుగా మారారంటే ఒంటెద్దు పోకడకు నిలువెత్తు నిదర్శనమన్నారు. ప్రజాకంఠక పాలనపై అన్ని వర్గాల వారు విసిగిపోయారని, భవిషత్తు కాంగ్రెస్ పార్టీదేనన్న విషయాన్ని కార్యకర్తలు గుర్తుంచుకుని పని చేసేలా ప్రోత్సహించాలన్నారు. పింఛన్ల పంపిణీకి కూడా అనేక షరతులు విధిస్తూ వృద్దులు, వితంతువులు, వికలాంగులను ఇబ్బందులకు గురి చేస్తుందని, ఈ విషయమై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేసేందుకు నెల రోజుల ప్రణాళికలు సిద్దం చేసినట్లు వివరించారు. ప్రలోభాలు, భయబ్రాంతులకు గురి చేసి ప్రజాప్రతినిధులను పార్టీలో చేర్చుకున్నంత మాత్రాన కార్యకర్తలను భయపెట్టలేరని, పార్టీలు వీడిన నేతలకు కార్యకర్తలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహా, మాజీ మంత్రులు గీతారెడ్డి, సునితా లక్ష్మారెడ్డి, మాజీ విప్ జగ్గారెడ్డి, మాజీ ఎంపి సురేష్ షెట్కార్, జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

సమష్టి కృషితోనే గ్రామాభివృద్ధి
జగదేవ్‌పూర్, జూలై 2: సమిష్టి కృషితోనే గ్రామాభివృద్ధి సాధ్యపడుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట్రాంరెడ్డి సూచించారు. శనివారం సిఎం దత్తత గ్రామాలైన నర్సన్నపేట, ఎర్రవల్లిలో గ్రామాభివృద్ది కమిటిలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యక్తిగత కక్షలతో గ్రామాభివృద్దిని అడ్డుకోవద్దని హితవు పలికారు. దత్తత గ్రామాలు ఎంతో అభివృద్దిని సాధించాస్సిన అవసరం ఉన్నందున ఐక్యతభావంతో ఉండాలని తెలిపారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటు పరువుతీసుకోవద్దన్నారు. వర్గవిభేధాలకు తావులేకుండా గ్రామం ఒకే కుటుంబంగా ఉండాలని సూచించారు. సంక్షేమ పథకాలు అందరికీ అందేలా అధికారులు చర్యలు తీసుకుంటామన్నారు.