మెదక్

అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, జూలై 2: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఒర్వలేక ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. రెండేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి ఏమిటో కాంగ్రెస్ నాయకుల కండ్లకు కనిపించడం లేదా అన్ని ప్రశ్నించారు. జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ కాంగ్రెస్‌కు సవాల్ విసిరారు. శనివారం టిఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి, మంత్రులుగా పదవులు అనుభవించారు తప్పా చేసిన అభివృద్ధి ఎమిటో చూపించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులపై తప్పుడు ప్రచారాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ హయంలో జిల్లాకు ఒక్క ప్రాజెక్టునైనా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టులో రైతుల ఆమోదంతోనే భూసేకరణ చేయడం జరుగుతుందని, బలవంతంగా ఎవ్వరు చేయడం లేదన్నారు. భూ నిర్వాసితులను కడుపులో పెట్టి ఆదుకుంటామంటే.. మింగేస్తారా అని విమర్శించడం సిగ్గుచేటన్నారు.ప్రజాక్షేత్రంలో సమాది అవుతారనే ఆందోళలతో రాద్దాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. భూ నిర్వాసితులకు తగిన నష్టపరిహారంతో పాటు ఇండ్ల నిర్మాణం, పిల్లలకు రెసిడెన్షియల్ విద్య, వృత్తిదారులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. పరిశ్రమలు నెలకొల్పితే కాలుష్యం రాదా? దానికంటే ప్రాజెక్టు నిర్మాణం అద్మానమా అని ప్రశ్నించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు మరో 20యేళ్ల పాటు ప్రజలు టిఆర్‌ఎస్‌కే పట్టం కడుతారన్నారు. రెచ్చగొట్టి లాభం పొందలానుకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

31 మసీదులకు నిధులు మంజూరు
నారాయణఖేడ్, జూలై 2: నారాయణఖేడ్ పట్టణంతోపాటు మండలంలో 31 మసీదులకు రంజాన్ పండుగ సందర్భంగా మరమ్మతులు చేసేందుకు లక్ష రూపాయలు ముఖ్యమంత్రి కెసిఅర్ మంజూరు చేశారని ఎమ్మెల్యే ఎం.్భపాల్‌రెడ్డి అన్నారు. శనివారం నాడు ఖేడ్ తహశీల్దార్ కార్యాలయంలో మసీదులకు సంబంధించిన గురువులకు నగదు రూపంలో ఒక్కొక్కటికి రూ.3225 అందించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ మైనార్టీల అభివృద్ధికి సిఎం ఎంతో కృషి చేస్తున్నారని రంజాన్ పండుగను పురస్కరించుకుని పేదలైన మైనార్టీలకు ఖేడ్ నియోజక వర్గంలో 1000 మందికి దుస్తులను పంపిణి చేశారు. అదే విధంగా మైనార్టీలకు గురుకుల పాఠశాలలు మంజూరు చేసి ఈ సంవత్సరమే ప్రారంభించారని ఆయన తెలిపారు. మైనార్టీలకు గతంలో ఇచ్చిన మాట మేరకు 12 శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు కమిటీ వేశారని, కమిటీ నివేదిక రాగానే అసెంబ్లీల్లో ఆమోదం తెలిపి ఢిల్లీకి పంపిస్తారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర మైనార్టీ టిఅర్‌ఎస్ నాయకుడు మోయిదిన్‌ఖాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం మైనార్టీలు ఉద్యమంలో చురుకుగా పాల్గొని సీఎం కెసీఅర్‌కు అండగా నిలిచారని, అందుకుగాను గతంలో ఇచ్చిన మాట మేరకు మైనార్టీకి చెందిన నాయకుడికే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేశారు.