మెదక్

ఆందోళనలతో జిల్లాలు రావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట టౌన్, జూలై 3: ప్రతిపక్ష రాజకీయ నాయకుల ఒత్తిళ్లు, ఆందోళనలతో జిల్లా వస్తాయనుకోవడం భ్రమఅని టిఆర్‌ఎస్ నేతలు అన్నారు. టిఆర్‌ఎస్‌వి జిల్లా ఉపాధ్యక్షుడు గుండురవితేజ, నేతలు తూముల శ్రీనివాస్, ముదిగొండ శ్రీనివాస్ లు మాట్లాడుతూ కొత్తజిల్లాలు పరిపాలన సౌలభ్యం కోసమే ఏర్పాటు అవుతాయని, కొంతమందిని ప్రలోభపెట్టి ఆందోళనలు చేయిస్తే కొత్తజిల్లా కేంద్రాలు ఏర్పడవన్నారు. పరిపాలన పరంగా అవసరమైన చోట ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తుందని అన్నారు.నియోజకవర్గంలోని మండలాలు ఇతర జిల్లాలోకి వెళ్లినంత మాత్రాన నష్టంలేదని, అన్ని మండలాలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటున్నాయన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చెడగొట్టేందుకే ప్రతిపక్షాలు పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. ఈ సమావేశంలో శ్రవణ్ పాల్గొన్నారు.