మెదక్

అక్రమ ఇంటి నిర్మాణం కూల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నశంకరంపేట, జూలై 3: అసైండ్‌మెంట్ భూమిలో అక్రమంగా ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న ఓ ఇంటిని రెవెన్యూ అధికారులు జెసిబితో ఆదివారం తెల్లవారుజామున కూల్చివేశారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని 345 సర్వే నంబర్‌లో లంబాడి శ్రీనివాస్ శోభ ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ఈ పనులను నిలిపివేయాలంటూ తహశీల్దార్ విజయలక్ష్మీ ఆదేశించారు. అయినప్పటికీ బెస్మెంట్ వరకు నిర్మించారు. ఆర్‌ఐ సతీష్ విఆర్‌ఓ, రెవెన్యూ సిబ్బందితో వెళ్లి ప్రభుత్వ భూమిలో ఇళ్లు నిర్మించరాదని, ఈ నిర్మాణ సామాగ్రిని గతంలో రెండు సార్లు స్వాదీనపరుచుకున్నారు. అయినా పిల్లర్లతో బెస్మెంట్ నిర్మించగా స్థానిక ఎస్సై నాగేశ్‌కు తహశీల్దార్ విజయలక్ష్మీ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నిమిత్తం పోలీసులు లంబాడి శ్రీనివాస్ శోభను పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి ప్రభుత్వ భూమిపై కౌన్సిలింగ్ నిర్వహించారు. అయినప్పటికీ వీరి తీరు మారకపోవడంతో ఆదివారం తెల్లవారుజామున జెసిబితో రెవెన్యూ సిబ్బంది ఇంటి వద్దకు వెళ్లి కూల్చివేశారు. కూలినాలి చేసుకొని మండల కేంద్రంలో 345 సర్వే నంబర్‌లో ఇండ్లు నిర్మించుకుంటే తన ఇంటి నిర్మాణాన్ని కూల్చివేశారని బాధితులు ఆరోపించారు. ఇదే సర్వే నంబర్‌లో తనతో పాటు మరికొందరు ఇండ్లు నిర్మించుకున్నారని, వీరి ఇండ్లను ఎందుకు కూల్చలేదని, తనపై కక్ష్యసాధింపు చర్యలకు పూనుకుంటున్నారని ఆరోపించారు.
* తహశీల్దార్ వివరణ
స్థానిక తహశీల్దార్ విజయలక్ష్మీని వివరణ కోరగా ప్రభుత్వ భూమిలో లంబాడి శ్రీను శోభ అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టారని తెలిపారు. బేస్మెంట్ వరకు నిర్మించిన ఇంటిని రెవెన్యూ సిబ్బందితో కూల్చివేయించినట్లు తెలిపారు.