మెదక్

ఫీజుల నియంత్రణ చట్టాన్ని తేవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, జూలై 3: ప్రైవేట్, కార్పోరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజులను నియంత్రించాలని, ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకరావాలని ఎబివిపి జిల్లా కన్వీనర్ అనిల్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ఐబి అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవాలయాలుగా ఉండాల్సిన విద్యాలయాలను దోపిడి సంస్థలు తయారు చేస్తున్నారని విమర్శించారు. చదువుల తల్లిని అంగట్లో సరుకుగా మార్చి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. అధిక ఫీజులు, నిబంధలకు విరుద్ధంగా విద్యాసంస్థలు నడుస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు కానీ పాలకులు కానీ పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో వౌలిక వసతులు కల్పించి నాణ్యమైన విధ్యను అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎబివిపి నాయకులు రమేష్, అశోక్, అభిలాష్, సంగమేశ్వర్ పాల్గొన్నారు.