మెదక్

ఆశించిన వర్షాలు లేక అన్నదాత ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ రూరల్, జూలై 3: పక్కజిల్లాల్లో వర్షాలు కురుస్తున్నా..మెదక్ ప్రాంతంలో ఆశించిన వర్షాలు లేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రెండు బలమైన కార్తులు పూర్తయినా వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆకాశంవైపు చూస్తున్నారు. ఈసారి మనకు కరవేనా అన్ని అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా వరుస కరవు ఎదుర్కొంటున్న కర్షకులు ఈసారైనా భారీ వర్షాలు కురిసి చెర్వులు, కుంటలు నిండుతాయని, వాగులు, వంకలు పారుతాయని ఆశిస్తున్నారు. కానీ ఇప్పటికీ సాదారణ వర్షపాతం నమోదుకాలేదు. ఒక్కనాడు వరదలు పారేలా వర్షం కురిసిన దాఖలాలులేవు. నాలుగు రోజుల క్రితం రెండు రోజులపాటు మబ్బులతోకూడిన ఆకాశం, దుబ్బురు వర్షం తప్ప భారీ వర్షం కురవలేదు. మెదక్ మండలంలో ఏ ఒక్క చెర్వులో చుక్కనీరు చేరలేదు. కనీసం భూమి కూడా పూర్తిస్థాయిలో తడవలేదు. పంటల పరిస్థితి ఎలాఉన్నా కనీసం తాగడానికి నీటి కరువు తప్పడంలేదు. వర్షాలు బాగా కురిస్తే బోర్లు రీచార్జీ అవుతాయని చూస్తున్నారు. కానీ ఇప్పటికీ అలాంటి పరిస్థితి ఎక్కడాలేదు. గ్రామాల్లో, పట్టణాల్లో ట్యాంకర్లే దిక్కవుతున్నాయి. బోర్లు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. వరుణుడు కరుణించకపోతే దాహంతో అల్లాడాల్సిన ప్రమాదంలేకపోలేదు. అడపాదడపా కురిసిన వర్షాలకు రైతులు బోర్ల వద్ద వరితుకాలు పోశారు. నారు పెరుగుతుంది. కొన్ని చోట్ల నాటుకు వచ్చింది. దుక్కులు సిద్దం చేశారు. రైతులు వేలాది రూపాయలు అప్పులుచేసి ఎరువుల బస్తాలు తెచ్చిపెట్టుకున్నారు. మున్ముందైనా వర్షాలు కురవాలని ఆశిద్దాం.