మెదక్

మల్లన్న సాగర్‌కు రండి.. తేల్చుకుందాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జూలై 3: నమ్మి పట్టం కట్టిన రైతులను నట్టేట ముంచ చూస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి హరీష్‌రావులు మల్లన్న సాగర్ ముంపు బాధితుల మందుకు వచ్చి తేల్చుకోవాలని ప్రభుత్వ మాజీ విప్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ ఏంచేసిందని పదే పదే కారు కూతలు కూస్తున్న టిఆర్‌ఎస్ నేతలకు దమ్ము, ధైర్యం ఉంటే బాధితుల ముందుకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఆదివారం సాయంత్రం మెదక్ జిల్లా సంగారెడ్డిలోని ఆర్ అండ్ బి అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతదేశ మొట్టమొదటి ప్రదాని మొదలుకుని నిన్నటి మన్మోహన్‌సింగ్ వరకు తెలంగాణ ప్రాంతానికి అందించిన సేవలు ఎనలేనివని, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు కాసుబ్రహ్మానందరెడ్డి మొదలుకుని నిన్నటి కిరణ్‌కుమార్‌రెడ్డి వరకు అందించిన సేవలను ప్రజలు చిరస్థాయిగా గుర్తుంచుకుంటారన్నారు. యుపిఎ చైర్‌పర్సన్, ఎఐసిసి అధ్యక్షరాలు సోనియాగాంధీ పెట్టిన బిక్షతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఏర్పడిన రాష్ట్రంలో సిఎం పదవిలో కెసిఆర్, ఆయన కుమారుడు కెటిఆర్, కూతురు కవిత, అల్లుడు హరీష్‌రావు పదవుల్లో కూర్చుండి సోకులు చేస్తున్నారని ఎద్దేవా చేసారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, సింగూర్, మంజీర బ్యారేజీ ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టించలేదా? అని ఆయన ప్రశ్నించారు. బిహెచ్‌ఇఎల్, ఓడిఎఫ్, బిడిఎల్ తదితర పరిశ్రమలను స్థాపించి ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి చూపించింది వాస్తవం కాదా ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల్లో భూ నిర్వాసితులు ఎక్కడైనా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు ఉన్నాయా, తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే ఎందుకు కొనసాగుతున్నాయో సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత టిఆర్‌ఎస్ నేతలపై ఉందన్నారు. భూ నిర్వాసితులు కోరుతున్నట్లుగానే 2013 చట్టం ప్రకారం పరిహారం అందించాల్సిందేనని అప్పటివరకు బాధితుల పక్షాన పోరాటం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలపై సరియైన అవగాహన లేక మతిభ్రమించి అధికార పార్టీ నేతలు మాట్లాడుతున్నారని అన్నారు.