మెదక్

మిషన్ భగీరథ పనుల్లో.. నిర్లక్ష్యాన్ని సహించేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, జూలై 3: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ బగీరథ పనుల్లో అధికారుల నిర్లక్ష్యాన్ని సహించేదిలేదని జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్ హెచ్చరించారు. ఆదివారం గజ్వేల్ మండలపరిదిలోని కోమటిబండలో చేపట్టిన మిషన్ బగీరథ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మండలాలవారిగా సంబందిత అధికారులతో వివరాలు సేకరించడంతోపాటూ జాప్యానికి గల కారణాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా తాగునీటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేసి ప్రతి ఇంటికీ స్వచ్చమైన తాగునీరు అందించాలని ఆదేశించారు. అయితే గజ్వేల్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే క్రమంలో అధికారులు, కాంట్రాక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని లేని పక్షంలో చర్యలు తప్పవని పేర్కొన్నారు. కాగా గ్రామాలలో మిషన్ బగీరథ పైప్‌లైన్‌ల నిర్మాణం కోసం తీసిన గోతులను కలెక్టర్ దృష్టికి తేగా పనులు త్వరగా పూర్తి చేసి రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమాలలో మిషన్ బగీరథ ఎస్‌ఇ విజయప్రకాశ్, గఢా అధికారి హన్మంతరావు, ఇఇ రాజయ్యతో పాటు అధికారులు తదితరులు పాల్గొన్నారు.