మెదక్

చట్టవ్యతిరేకంగా రిజయర్వాయర్ నిర్మించడమా ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూలై 3: చట్టవ్యతిరేకంగా రిజర్వాయర్ నిర్మించాలనుకోవడం సరికాదని, అధికారులు, పోలీసులతో భూసేకరణకు 123జిఓ ప్రకారం చేయడాన్ని వెంటనే నిలిపేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వీరభద్రం డిమాండ్ చేశారు. ఆదివారం మెదక్ జిల్లా తొగుట మండలం తిరుమలాపూర్‌లో బిఎస్పీ, ఆర్‌ఎస్‌పి, ఎస్‌యుసిఐ రాష్ట్ర నేతలు శ్రీనివాస్ బహద్దూర్, జానకిరాములు, మురహరిలతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. అధికారులు ప్రజల నుంచి బలవంతంగా భూసేకరణ చేయడం సరికాదన్నారు. చట్టవ్యతిరేకమైన 123జిఓ రద్దు చేయాలన్నారు. డిపిఆర్ లేకుండా ప్రాజెక్టు నిర్మించడం పై ప్రజలను ఆందోళనకు గురి చేయడం విడ్డూరంగా ఉందన్నారు. 2పంటలు పండే భూముల్లో ప్రాజెక్టు నిర్మించాలనుకోవడం సరికాదన్నారు. తొగుట, కొండపాక మండలాల్లోని 14గ్రామాల ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. చారిత్రక కట్టడాలను, వేల ఏండ్ల చరిత్ర ఉన్న గ్రామాలను ముంపుకు గురిచేసి ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నిర్వాసిత గ్రామాల్లో పెళ్లిలు సైతం ముంపుకు గురైతుందని, ఎక్కడికి పోతారోనని రద్దైతున్నాయన్నారు. రిటైర్డ్ ఇంజనీరింగ్ నిపుణులు హన్మంతరావు 50టిఎంసిల ఎత్తిపోతల పథకం అవసరం లేదని, పూర్తి వివరాలతో వెల్లడించారన్నారు. గొలుసు కాల్వలు, చిన్న ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించేందుకు 25వేల కోట్లు తక్కువైతున్నా ప్రభుత్వం విస్మరించి మల్లన్నసాగర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడంలో ఆంతర్యమేందని ప్రశ్నించారు. ప్రాజెక్టు వద్దని చెప్తున్నా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం శోచనీయమన్నారు. 2013చట్టం ప్రకారం ప్రజలకు మేలు చేయాలే తప్ప 123జిఓను రద్దు చేయాలన్నారు. జిఓ ప్రకారం భూసేకరణ చేసిన నిర్వాసితులకు ఇచ్చిన హామిలను అమలు చేయకుండా తప్పుకుంటున్నారని, వారికి న్యాయం కోసం తాము సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. నెలల తరబడిగా నిర్వాసిత గ్రామాల్లో ప్రజలు ఆందోళన చేస్తుంటే ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు వారి బాధలు పట్టకుండా వ్యవహరించడం దారుణమన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరించాలని లేకుంటే గుణపాఠం తప్పదన్నారు. ప్రజలు చేస్తున్న న్యాయపోరాటానికి అన్ని వర్గాలు మద్దతిస్తున్నాయని, వారికి న్యాయం జరిగే వరకు తాము అండగా ఉంటామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర నేతలు రాములు, జిల్లా కార్యదర్శి మల్లేశం, జయరాజ్, జెఎసి కన్వీనర్ భాస్కర్ పాల్గొన్నారు.