మెదక్

విద్యారణ్య ఆవాస విద్యాలయంలో విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూలై 19: సిద్దిపేట మండలం తడ్కపల్లి విద్యారణ్య ఆవాస విద్యాలయంలో టెన్త్ విద్యార్థి వినయ్‌కుమార్ అస్వస్థతకు గురై మృతి చెందాడు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్య వైఖరే కారమణమని ఆరోపిస్తూ సిద్దిపేట ఏరియా ఆస్పత్రి వద్ద విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టారు. విద్యార్థి పోస్టుమార్టాన్ని ఏరియా ఆస్పత్రిలో చేయించవద్దని డిమాండ్ చేశారు. ఏరియా ఆస్పత్రి వైద్యుల్లో ఒకరు పాఠశాల యాజమాన్యం బాంధువుగా ఉండడంవల్ల రిపోర్టు తారుమారు చేసే అవకాశం ఉందని ఆరోపించారు. ఇతర డాక్టర్లతో పోస్టుమార్టం చేయించాలన్నారు. తమ కుమారుడు వినయ్ పండుగరోజు నుంచి ఆనారోగ్యంతో బాధపడుతున్నా ఆదివారం వరకు తమకు పాఠశాల హెచ్‌ఎం, యాజమాన్యం సమాచారం అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుమారుని మృతికి కారణం పాఠశాల యాజమాన్యమేనన్నారు. కుమారుని మృతికి కారణమేందో యాజమాన్యం, హెచ్‌ఎం వచ్చి ప్రజల సమక్షంలో చెప్పాలన్నారు. సిఐ సురేందర్‌రెడ్డి, ఎస్‌ఐలు రాజేంద్రప్రసాద్, శ్రీనివాస్‌రెడ్డి యాజమాన్యంను పిలిపించి మాట్లాడించారు. విద్యార్థి అనారోగ్యం పై ఆదివారం సమాచారం అందిందని, విరేచనాల నివారణకు గోలీలు ఇచ్చామన్నారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో సిద్దిపేటలోని విద్యార్థి బంధువులకు సమాచారం ఇచ్చి ఏరియా హాస్పిటల్‌కు తరలించామన్నారు. ఇక్కడ అడ్మీషన్ చేశాకే తల్లిదండ్రులకు సమాచారమిచ్చామన్నారు. అక్కడికి వచ్చిన డిప్యూటి ఇఓ శ్యాంప్రసాద్‌రెడ్డికి విద్యార్థులచే ఇతర పనులు చేయిస్తున్నారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పాఠశాలను సందర్శించారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి కారకుల పై చర్యలు తీసుకుంటామని హామినిచ్చారు.