మెదక్

మాసాయిపేటను మండల కేంద్రం చేయకుంటే జాతీయ రహదారి దిగ్బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్దుర్తి, జూలై 19: మాసాయిపేట గ్రామాన్ని ప్రత్యేక మండలం చేయాలని లేకుంటే జాతీయ రహదారిని దిగ్బంధం చేసి, ధర్నా, రాస్తారోకో కార్యక్రమాలు చేపడుతామని మాజీ మంత్రి, ప్రస్తుత డిసిసి అధ్యక్షురాలు సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం గ్రామంలో చేపట్టిన రిలేదీక్షలకు సంఘీభావం తెలపడానికి వచ్చిన సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో సైతం మాసాయిపేట గ్రామం ముందుడి పోరాటం చేసిందన్నారు. అప్పట్లో మంత్రి హరీష్‌రావు గ్రామాన్ని దత్తత తీసుకున్నామనడం తప్ప గ్రామానికి చేసింది ఏమీలేదన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి మాసాయిపేట గ్రామాన్ని మండల కేంద్రం చేయాలని దీనికోసం కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుందన్నారు. ఎలాంటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉంటామని సునీతారెడ్డి తెలిపారు. అన్ని సౌకర్యాలూ కలిగిన మాసాయిపేట గ్రామాన్ని ప్రత్యేక మండలం చేయాలని అమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిరామగౌడ్, మదుసుధన్‌రెడ్డి, నారాయణచారీ, దుర్గస్వామి, యాదగిరి, నర్సింలు, లక్ష్మణ్‌గౌడ్, సత్యనారాయణ, అశోక్, జయరామ్‌రెడ్డి పాల్గోన్నారు.