మెదక్

విద్యుత్ విజిలెన్స్ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నశంకరంపేట, జూలై 19: చిన్నశంకరంపేట మండల కేంద్రంతో పాటు 20 గ్రామపంచాయితీల్లో విద్యుత్ విజిలెన్స్ దాడులు కొనసాగాయి. మెదక్ డిఈ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్ ద్వారా వాడవాడకు ఇంటింటికి చేరుకొని అక్రమ విద్యుత్ వైర్లను గుర్తించారు. అలాగే అక్రమంగా విద్యుత్ వాడకందారులను గుర్తించి కేసులు చేస్తున్నట్లు తెలిపారు. మీటర్లు కలిగి ఉండి బిల్లులు కట్టని వారు వెంటనే చెల్లించి ట్రాన్స్‌కో సహకరించాలని సూచించారు.
సత్తా చాటిన టిఎంయు
గజ్వేల్, జూలై 19 : ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో మంగళవారం జరిగిన పోలింగ్‌లో జిపిపి డిపోలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ సత్తా చాటింది. 190 ఓట్ల ఆదిత్యంతో దూసుకెళ్ళగా, 49 ఓట్లు టిఎన్‌ఎంయు, ఎంప్లాయిస్ యూనియన్‌కు 49 ఓట్లు దక్కాయి. అలాగే టిబికెఎస్‌కు 14 ఓట్లు పడినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. మజ్దూర్ యూనియన్ ఆద్వర్యంలో కార్మికులు టపాసులు పేల్చడంతోపాటు స్వీట్లు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు.