మెదక్

అపర అశోక చక్రవర్తి కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, జూలై 20: అశోక చక్రవర్తి రోడ్డుకు ఇరువైపుల చెట్లు నాటించినట్లు చరిత్ర చెబుతుంది. ఆ చరిత్రను ఇప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్ తిరగరాశారని ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నాడు మెదక్ క్యాంప్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. దేశ చరిత్రలో లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో 40 కోట్ల మొక్కలకు ముఖ్యమంత్రి కెసిఆర్ శ్రీకారం చుట్టారన్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 10 కోట్ల మొక్కలకుపైన నాటడం జరిగిందని ఆమె తెలిపారు. మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించడం ప్రధాన కర్తవ్యంగా బాధ్యత వహించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రెండవ విడత చేపట్టిన హరితహారం బ్రహ్మాండంగా కొనసాగుతుందని, ఇందులో ప్రజలు కూడా భాగస్వామ్యం పంచుకుంటున్నారన్నారు. మొక్కలు నాటడం నిరంతర ప్రక్రియ అన్నారు. రెండవ విడత జూలై 8 నుండి 22 వరకు 40 కోట్ల మొక్కలు రాష్ట్రంలో పెంచడానికి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టిందని ఆమె తెలిపారు. భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి హరితహారంలో చరిత్రను సృష్టించారని ఆమె కొనియాడారు. మన విజయం ప్రజల విజయం, హరితలక్ష్మీ బొట్టు పెట్టి మొక్క నాటమ్మ అనే కార్యక్రమాన్ని పట్టణాల్లో విస్తృతంగా కొనసాగుతున్నాయన్నారు. పుట్టిన పాప నుండి వృద్దుల వరకు మొక్కలు నాటి పెంచాల్సిన అవశ్యకత ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తలపెట్టిన హరితహారం కార్యక్రమం మానవ మనుగడకు ప్రగతిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఓజోన్ పొర చిరిగి పంటలకు, రైతులకు, ప్రజలకు ఇబ్బందిగా ఏర్పడిందన్నారు. దీంతో శారీరక సంబంధిత రోగాలు ఉత్పన్నమవుతాయని తెలిపారు. అందుకే చెట్టు నాటి పెంచాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్డు వైండనింగ్ కారణాల వలన మొక్కలు పెంచలేకపోతున్నామని ఆమె తెలిపారు. అమెరికాలో ఒక్కొక్క వ్యక్తి 1500 మొక్కలు పెంచుతున్నట్లు తెలిపారు. ఇక్కడ ఒక్క మనిషి 25 మొక్కలను పెంచడానికే ఇబ్బందిగా మలుసుతున్నారన్నారు. మొక్కలు నాటడం ఒక ప్రక్రియ అయితే వాటిని పెంచడం మరో కార్యక్రమంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కోతులు అడవిని వదిలి గ్రామాలు పట్టణాలకు చేరుకున్నాయన్నారు. అడవి జంతువులు కూడా గ్రామాల వైపు పరుగులు తీస్తున్నాయన్నారు. వెయ్యి సంవత్సరాల క్రింద ఉన్న చెట్లే ఇప్పుడు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే అడవులు నిర్లక్ష్యానికి గురైనట్లు తెలిపారు. సర్పంచ్‌లు గ్రామాల వారీగా ప్రజలకు అవగాహణ కల్పించి మొక్కలు నాటి పెంచాలని సూచించారు. సామాజిక బాధ్యతగా తీసుకున్న హరితహారం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ అశోక్, జడ్పిటిసి లావణ్యరెడ్డి, ఎంపిపి లక్ష్మీ కిష్టయ్య, గడ్డమీది కృష్ణాగౌడ్, ఐతారం నర్సింలు, రాధా గోవింద్, అంకం రవి తదితరులు ఉన్నారు.