మెదక్

కేంద్ర నిధులను పక్కదారి పట్టిస్తున్న టిఆర్‌ఎస్ సర్కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, జూలై 22: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నా ఇక్కడి సర్కారు పక్క దారి పట్టిస్తోందని, రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రూ. 721 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేసినా రైతులకు చెల్లించకపోవడంలో అంతర్యమేమిటని టిడిపి రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న సిఎం కెసిఅర్ అన్నదాతలకు ఒరగబెట్టిందేమీలేదని, చివరకు 15వందల మంది రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటే ఏ ఒక్క కుటుంబాన్ని పరామర్శించిన పాపానపోలేదని విమర్శించారు. ముఖ్యంగా ఎన్నికల సందర్బంగా రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన సిఎం కెసిఅర్ మూడవ విడత చెల్లించకపోవడంతోపాటు ఇస్తున్న డబ్బు వడ్డీకే సరిపోతుందని ఆరోపించారు. అలాగే జిల్లాలో రూ. 26 వందల కోట్లు రైతులకు రుణాలు ఇవ్వాల్సి ఉండగా కేవలం వంద కోట్ల రుణాలు ఇచ్చి చేతులు దులుపుకున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా సహకార బ్యాంక్‌లలో రూ. 30 వేలు ఇచ్చి 3లక్షల రుణంగా మార్చడంతోపాటు రైతుల ఇళ్లపైకి అధికారులు దాడులు చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలిపారు. అయితే యేండ్ల తరబడిగా ఇచ్చిన అప్పుకు చక్రవడ్డీని మించిపోగా రూ. లక్షల్లో ఒక్కో రైతు బాకీ పడినట్లు లెక్కలు తీస్తున్నారని చెప్పారు. కాగా రైతు రుణమాఫీ, ఇన్‌పుట్ సబ్సీడీ, బ్యాంక్ రుణాలు, సహకార రుణాల వసూళ్ళకు నిరసనగా ఈ నెల 27వ తేదీన గజ్వేల్‌లో ఆందోళనకు దిగుతున్నట్లు స్పష్టం చేశారు. నేతలు బొల్లారం ఎల్లయ్య, విరాహత్‌అలి, షరీఫొద్దీన్, రఘుపతిరెడ్డి, ప్రభాకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.