మెదక్

48గంటల బంద్‌కు అఖిలపక్షం పిలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సాపూర్,జులై 22: నర్సాపూర్ మండల ప్రజల అభిప్రాయం మేరకు నూతనంగా ఏర్పాటు చేయనున్న సంగారెడ్డి జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం నాయకులు 48గంటల బంద్‌కు పిలుపునిచ్చారు. శుక్రవారంనాడు నర్సాపూర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అఖిలపక్షం నాయకులు స్థానిక సర్పంచ్ వెంకటరమణారావు, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌గుప్త, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆంజనేయులుగౌడ్, ఎంపిటిసి సభ్యులు రాజేందర్‌యాదవ్, సురేష్, నర్సింలు, నాయకులు మల్లేశ్, అశోక్, భరత్‌గౌడ్, రషీద్, మహమ్మద్ మాట్లాడుతూ నర్సాపూర్ మండల ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండ ఇష్టారాజ్యంగా 70కిలో మీటర్ల దూరంలోని మెదక్ జిల్లాలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 33వ రోజుకు చేరుకున్నాయి. అయినప్పటికి పాలకవర్గం నుంచి ఏలాంటి స్పందన రావడం లేదు. దాంతో 48గంటల పట్టణ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు వెల్లడించారు. బంద్‌కు వ్యాపార, వాణిజ్య వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు మద్ధతు ఇవ్వాలని కోరారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, నర్సాపూర్ పట్టణానికి చెందిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ రాజమణి, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్‌కు వినతిపత్రాలు అందించడం జరిగిందని అన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల స్పందన ఇలాగే ఉంటే నర్సాపూర్ పట్టణ బంద్‌ను సంపూర్ణంగా నిర్వహించి పేద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు, ముట్టడులు ఉపక్రమిస్తామని హెచ్చరించారు.
అందోల్‌లో అత్యధిక వర్షపాతం
మెదక్, జూలై 22: మెదక్ డివిజన్‌లో అత్యధిక వర్షపాతం అందోల్‌లో నమోదు కాగా వెల్దుర్తిలో అత్యల్ప వర్షపాతం నమోదైనట్లు ఆర్డీఓ కార్యాలయం ఉప తహశీల్దార్ యాదగిరి శుక్రవారం నాడు మాట్లాడుతూ తెలిపారు. పుల్కల్ మండలంలో 43.2 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు కాగా జిన్నారంలో 16.4, హత్నురలో 22.2, రామాయంపేటలో 10.2, చిన్నశంకరంపేటలో 18, పెద్దశంకరంపేటలో 25.4, నర్సాపూర్‌లో 16, కౌడిపల్లిలో 12.2, పాపన్నపేటలో 7.2, కొల్చారంలో 11, మెదక్‌లో 6, రేగోడ్‌లో 30, శివ్వంపేటలో 14.2, వెల్దుర్తిలో 2.4, అల్లాదుర్గంలో 37.6, టేక్మాల్‌లో 50.6, చేగుంటలో 5.8, అందోల్‌లో 53.6 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు యాదగిరి వివరించారు.