మెదక్

విద్యారంగాభివృద్ధికి ప్రభుత్వ ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోగిపేట, జూలై 22: జోగిపేట పట్టణంలోని ఎన్‌టిఆర్ స్టేడియంలో నిర్మించిన క్రీడా మైదాన భవనాన్ని శుక్రవారం నాడు అందోల్ ఎమ్మెల్యే బాబుమోహన్ ప్రారంభించారు. మూడు కోట్ల రుపాయలతో ఈ భవనాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా అభివృద్ది కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో రకాల నిధులను కేటాయించడం జరుగుతుందన్నారు. ఈ మైదానాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని కోరారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి కృషి చేయడం జరుగుతుందన్నారు.
ఆ తరువాత ఎఎన్‌ఎం కార్యకర్తల సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆయన వివరించారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ముందున్నట్లు ఎమ్మెల్యే బాబుమోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ మాజీ ఎంపి మాణిక్యరెడ్డి, జోగిపేట ఆత్మ కమిటి చైర్మన్ లక్ష్మీకాంతరెడ్డి, తహశీల్దార్ నాగేశ్వర్‌రావు, ఎంపిడిఓ కరుణశీల, నాయకులు లింగన్న, బిబి.నాగభూషణం, వెంకటేశం, శ్రీ్ధర్, గోపాల్, లక్ష్మణ్, శ్రీకాంత్, లింగంతో పాటు అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.