మెదక్

అసంబద్ధ విధానాలవల్లే అన్నదాత ఆత్మహత్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొగుట, జూలై 22: ప్రజల ఇష్టాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం మల్లన్నసాగర్‌పై నిరంకుశంగా వ్యవహరించడం వల్లే రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రైతులవి ఆత్మహత్యలు కాదని, ప్రభుత్వ హత్యలేనని మాజీ మంత్రులు దామోదర్ రాజనర్సింహ, సునితా లక్ష్మారెడ్డిలు ఆరోపించారు. శుక్రవారం మండలంలోని పల్లెపహడ్‌లో మల్లన్నసాగర్ ముంపు బెంగతో ఆత్మహత్య చేసుకున్న రైతు నర్సింలు కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేసి ప్రజలను ముంచి కాంట్రాక్టర్లకు మేలుచేసేలా 50 టిఎంసిలకు పెంచిందని విమర్శించారు. తాము ప్రజలకు నష్టం లేని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్‌కు అనుకూలమని, మల్లన్నసాగర్‌కు మాత్రం వ్యతిరేకమన్నారు. ముంపు లేకుండా కాల్వల ద్వారా నీరందించే అవకాశాలున్నా కావాలనే ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ ప్రజలను ఆందోళనలకు గురిచేస్తుందని విమర్శించారు. ప్రభుత్వ విధానాల వల్లే ఇప్పటికే గుండెపోటుతో పలువురు మరణించగా, ఒకరు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం 2013 చట్టం ప్రకారం గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాకే వారి అభిప్రాయం మేరకు ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకోకుండా ఇష్టారీతిగా వ్యవహరిస్తుందన్నారు. ప్రజలను భయాందోళనకు గురిచేయకుండా, ప్రభుత్వం ఇప్పటికైనా ప్రాజెక్టుకు భూసేకరణ నిలిపివేసి ప్రాజెక్ట్‌ను ఉపసంహరించుకోవాలని, లేకుంటే ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తుందన్నారు. అంతకుముందు మృతుడు నర్సింలు కుటుంబానికి ఐదు వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ సమావేశంలో నాయకులు చిలువేరు రాంరెడ్డి, ముషిణం శ్రీనివాస్‌గౌడ్, పాలెపు లక్ష్మణ్, సర్దార్, మల్లారెడ్డి, ఎల్లారెడ్డి, శ్రీనివాస్‌చారి తదితరులు పాల్గొన్నారు.