మెదక్

దోచుకునే వారికి తెలంగాణలో స్థానం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబ్బాక, ఆగస్టు 15: తెలంగాణ రాష్ట్రంలో దోచుకునే వారికి స్థానం లేదని, అన్యాయాలకు పాల్పడేవారిని ప్రభుత్వం విడిచిపెట్టదని అంచనాల కమిటి రాష్ట్ర చైర్మన్, ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. సోమవారం దుబ్బాకలోని గాంధీ విగ్రహం వద్ద జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం మాట్లాడారు. ప్రజలను అన్యాయానికి గురిచేసే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, ప్రజలకు రక్షణగా ఉన్న ప్రజాప్రభుత్వాన్ని ఏ దుష్టశక్తి ఏం చేయలేదన్నారు. మల్లన్నసాగర్‌తో దుబ్బాక నియోజకవర్గంలోని 1.29లక్షల ఎకరాలు సస్యశ్యామలమైతాయని, అన్ని చెరువులు, కుంటలు నీటితో నిండి భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. ఇటీవల పడ్డ వానలకు 900 టిఎంసిలకు పైగా గోదావరీ జలాలు సముద్రం పాలైనాయన్నారు. మల్లన్నసాగర్ నిర్మించి ఉంటే లక్షల ఎకరాలకు ఉపయోగపడి ఉండేదన్నారు. నియోజకవర్గంలోని ఆర్‌అండ్‌బి, పిఆర్ రోడ్లకు 500కోట్లతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. మిషన్ భగీరథ కింద నియోజకవర్గంలోని ప్రజలకు మంచినీరు అందించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సిఎం కెసిఆర్ ప్రత్యేకంగా 25కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందేనన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి పద్మ, జడ్పిటిసి గౌతమి, ఎఎంసి చైర్మన్ ఎల్లారెడ్డి, కమిషనర్ భోగేశ్వర్లు పాల్గొన్నారు.

మంత్రి చేతుల మీదుగా దళితులకు భూపట్టాలు పంపిణీ

జగదేవ్‌పూర్, ఆగస్టు 15:స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిరు పేద రైతు కుటుంబాలకు సోమవారం రాష్ట్ర నీటిపారుధల శాఖ మంత్రి హరీష్‌రావు సంగారెడ్డిలో భూపట్టాలను అందజేశారు. మండలపరిధిలోని వట్టిపల్లికి చెందిన కోలిపాక భాగ్య, టప్పెట్లమహేశ్వరి, టప్పెట్ల స్వప్నలకు 6.18కరాల సాగుభూమికి సంభందించిన పట్టాసర్టీపికెట్లను మంత్రిహరీష్‌రావు, ఎంపి కోత్తప్రభాకర్‌రెడ్డిలు అందాజేశారు.