మెదక్

హత్నూర మండలాన్ని .. సంగారెడ్డి జిల్లాలోనే కొనసాగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హత్నూర, ఆగస్టు 28: ప్రభుత్వం ప్రకటించిన డ్రాప్ట్ ప్రకారం హత్నూర మండలాన్ని సంగారెడ్డి జిల్లాలోనే ఉంచాలని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం మండల పరిధిలోని దౌల్తాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతిపాదనలు హత్నూర మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కొనసాగించేలా ప్రతిపాదించారని, కానీ ఇందుకు విరుద్దంగా కొందరూ రాజకీయ నాయకులు స్వప్రయోజనాల కోసం హత్నూర మండలాన్ని మెదక్ జిల్లాలో కొనసాగే విధంగా కార్యచరణ రూపొందిస్తున్నారన్నారు. ఈ ప్రయత్నాలను పరిగణలోకి తీసుకోకుండా హత్నూర మండల ప్రజల ఆకాంక్ష మేరకు సంగారెడ్డి జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఎంపిపి ఉపాధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపిపి అధ్యక్షులు ఆంజనేయులు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.