మెదక్

గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, ఆగస్టు 28: గ్రామస్థాయి నుండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని యూత్ కాంగ్రెస్ మెదక్ నియోజకవర్గ ఇంచార్జీ సంతోష్‌రెడ్డి వెల్లడించారు. ఆదివారం నాడు మెదక్ రహదారి బంగ్లాలో జరిగిన మెదక్ పార్లమెంటరి యూత్ కాంగ్రెస్ సమావేశం జరిగిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి అయినప్పటికినీ ఉద్యోగాలు లేక యువకులు రోడ్లపై పడ్డారని సంతోష్‌రెడ్డి తెలిపారు. ఫీజు రియంబర్స్‌మెంట్‌లో కూడా ప్రభుత్వం చదువుకుంటున్న విద్యార్థులకు అన్యాయం చేసిందని సంతోష్‌రెడ్డి ఆరోపించారు. ఖరీప్ సీజన్‌లో వర్షాలు లేక రైతులు వేసుకున్న పంటలు ఎండిపోతున్నప్పటికి కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రుణమాఫి విషయంలో పూర్తి స్థాయిలో రైతులకు న్యాయం చేయకపోవడం దురదృష్టకరమన్నారు. ఖరీప్ సీజన్‌లో రైతులకు రుణాలు దొరకక ప్రైవేటు అప్పులు తీసుకొని వరి నాట్లతో పాటు మెట్ట పంటలు వేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. వీటన్నింటికి కూడా ప్రైవేటు అప్పులతో పంటలు వేసుకొని రైతులు చాలా నష్టపోయారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా వేసిన పంటలు చేతికి రాక కనీసం పెట్టుబడులకు కూడా నోచుకోలేని స్థితిలో రైతులు ఉన్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అనేక రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఇలాంటి సమస్యలన్నియు కూడా గ్రామ స్థాయిలో పర్యటించి ప్రజలకు వివరిస్తామని ఆయన తెలిపారు. మెదక్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ప్లోర్ లీడర్ మధుసూదన్‌రావు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్నది యువజన కాంగ్రెస్ పార్టీయే అన్నారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఏకీకరణ కోసం ఎంతో కృషి చేశారన్నారు. స్థానిక సమస్యలు ప్రభుత్వం దృష్ఘ్టికి తేవడానికి యువజన కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. యువతను గ్రామాల వారిగా సంఘిటితం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సమస్యల కోసం ధర్నాలు, నిరసనలు చేయడానికి ఒక ప్రణాళికను రూపొందించుకోవాలని ఆయన సూచించారు. 2019లో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి యూత్ కాంగ్రెస్ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్‌రావు, మేడిశెట్టి శంకర్, గూడూరి ఆంజనేయులుగౌడ్, వెంకటరమణ, మల్లేశం, నరేష్, చాప రవి, అనిరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెదక్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా చాప రవి, మెదక్ టౌన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎండి అనిరుద్దీన్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించారు.