మెదక్

యోగతోనే ఆరోగ్యం: మంత్రి హరీష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఆగస్టు 28: యోగాతోనే ఆరోగ్యమని..యోగా ప్రతి మనిషికి అవసరమని, దినచర్యలో భాగం కావాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఆదివారం సుందర సత్సంగ్‌భవన్‌లో దత్తక్రియ యోగా శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానసిక ఒత్తిడితో చాలామంది ఆరోగ్యాన్ని విస్మరిస్తు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మనిషికి ధనం గొప్పకాదని, ఆరోగ్యమే ముఖ్యమన్నారు. నిత్యం భయంతో బతికితే మనిషికి ఆరోగ్యం మంచిది కాదన్నారు. వ్యక్తిత్వ వికాసంతో జీవిస్తేనే మంచి ఆరోగ్యమన్నారు. రోజువారీ కార్యక్రమాల్లో యోగా పై దృష్టి సారిస్తే అనారోగ్యాన్ని దూరం చేసుకోవచ్చన్నారు. యోగాతో ఏకాగ్రత, పట్టుదలతో రోజువారీ పనులు సులభంగా చేసుకోవచ్చన్నారు. యోగా నేర్చుకోవడంతో పాటు 10మందికి నేర్పాలన్నారు. దేశవ్యాప్తంగా ఉచితంగా గణపతి సచ్చిదానందస్వామి యోగా నేర్పుతున్నారన్నారు. అనంతరం మంత్రి వారితో కలిసి యోగా చేశారు. ఎమ్మెల్యే రామలింగారెడ్డి, వైస్ చైర్మన్ అత్తర్‌పటేల్, కౌన్సిలర్ స్వప్న, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.