మెదక్

ఆలయ భూమి అన్యాక్రాంతం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, ఆగస్టు 28: జిల్లాలోని వర్గల్ మండలం నాచారం గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి సంబంధించిన భూమి కబ్జా చేసి వెంచర్లు వేస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని లక్ష్మీనరహింహ సేవా ఆశ్రమ ట్రస్టీ చైర్మన్ ఆర్.ఇ నాగేశ్వర్‌రావు జిల్లా అధికారులను వేడుకున్నారు. ఆదివారం సంగారెడ్డి ఐబి అతిధి గృహంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. 341/3 సర్వేనంబర్‌లో ఉన్న 21గుంటల ఆలయ భూమిని కొందరూ 341 సర్వేనంబర్‌లో అక్రమంగా కలుపుకొని లేఅవుట్లు వేసి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. జిల్లా అధికారులు స్పందించి ఆశ్రమానికి ధానంగా ఇచ్చిన ఈ భూమిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. గతంలో రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై 2007లో చేసిన ట్యాంపరింగ్ మూలంగా భూమి ఎక్కువ ఉందని రికార్డుల్లో పొందుపర్చారని, ఈ విధంగా తమకున్న భూమి కంటే అధికంగా అమ్ముకున్నారని, లక్ష్మినర్సింహాస్వామి సేవాశ్రమ సమితికి చెందిన భూమి కూడ తమదేనంటూ అక్రమంగా లేఅవుట్‌లు వేసి విక్రయిస్తున్నారని తెలిపారు. ఇదే కాకుండా పక్కన ఉన్న దేవాలయానికి సంబంధించిన భూమిని కూడా కబ్జాచేశారని దీనిపై అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.