మెదక్

నవరాత్రోత్సవాలకు నవ్యరూపాల్లో గణనాథుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దౌల్తాబాద్, ఆగస్టు 28 : సెప్టెంబర్ 5 నుండి వినాయక నవరాత్రులు ప్రారంభం కానుండడంతో ఆయా గ్రామాల్లో గణపతి ఉత్సవాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. దౌల్తాబాద్‌లో గణేష్ ఉత్సవాల కోసం ఏర్పాటుచేసిన విగ్రహాల అమ్మక కేంద్రంలో ఉన్న వివిధ ఆకృతుల గణనాథుని విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. ఒక్కో విగ్రహం 15వందల రూపాయల నుంచి 8వేల రూపాయల వరకు లభిస్తున్నాయి. గత యేడాది మండలంలోని ఆయా గ్రామాల్లో సుమారు 2వందల వరకు విగ్రహాలను ఏర్పాటుచేసి ఉత్సవాలను జరిపారు. ప్రతిమలను మూడు రోజులు మొదలుకొని 10 రోజుల వరకు నిర్వాహకుల వీలును బట్టి సమీప చెరువులో నిమజ్జనం చేస్తారు.
పోలీసుల అనుమతి తప్పనిసరి
మండలంలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న విగ్రహాలకు పోలీసుల అనుమతి ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుందని దౌల్తాబాద్ ఎస్‌ఐ పరశురాం తెలిపారు. పోలీస్‌స్టేషన్ నుండి ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతనే విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. అలాగే నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
మందకొడిగా విగ్రహాల విక్రయం
విక్రయ కేంద్రాల్లో గణేష్ విగ్రహాల అమ్మకం మందకొడిగా సాగుతున్నది. మండలంలో నెలకొన్న తీవ్ర కరువు వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని వ్యాపారస్తులు పేర్కొంటున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ యేడు విగ్రహాల అమ్మకాలు చాలా వరకు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు.
నిమజ్జనానికి నీటి కరువు
మండలంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొనడంతో ఆయా గ్రామాల్లోని చెరువు కుంటల్లోకి దాదాపు నీటి చుక్కలు రాలేదు. దీంతో పలు గ్రామాల్లోని చెరువులు బోసిపోయి ఉన్నాయి. వినాయకులను నిమజ్జనం చేయడం కోసం నీళ్ళులేని పరిస్థితి నెలకొన్నది. గణనాధులు కరునించి మంచి వర్షాలు కురిపిస్తే నిమజ్జనానికి నీటి సమస్య తొలగిపోతుందని భక్తులు పేర్కొంటున్నారు.