మెదక్

కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఆగస్టు 28: కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయంలో ఆదివారం రాత్రి అంచనాల కమిటి రాష్ట్ర చైర్మన్ రామలింగారెడ్డితో కలిసి ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి వివిధ ప్యాకేజీల వారీగా పలు ప్రాజెక్టుల పై అధికారులతో సమీక్షించారు. సకాలంలో పనులు పూరె్తైయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేకంగా కరీంనగర్ జిల్లా భూసేకరణ పనులు వేగవంతం చేయాలన్నారు. ఇప్పటికీ 10శాతం పనులు మాత్రమే పూరె్తైనాయని, మరో వారంలో సమీక్షిస్తానని, ఈక్రమంలో 50శాతం మేర పనులు పూర్తిచేసేలా నివేదికలు సిద్దం చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పని చేయాలన్నారు. మొదటి విడతలోనే సమస్య పరిష్కారమయ్యేలా ఆయా ప్రాంతాల రైతులు, ప్రజలు సహకరించేలా చొరవ చూపాలన్నారు. ప్రజలతో సత్సంబదాలతో మాట్లాడి అవగాహన కల్పించి ప్రాజెక్టుకు సహకరించేలా ఓపిక, సహనంతో వ్యవహరించాలని కోరారు. వర్కింగ్ ఏజన్సీల్లో సరిగా పనులు చేయించేలా అధికారులు నిర్మోహమాటంగా ఉండాలని సూచించారు.
కొత్తజిల్లాల పునర్విభజనకు ముందే భూసేకరణ చేయాలి
కొత్త జిల్లాల పునర్విభజనకు ముందే కాళేశ్వరం భూసేకరణ చేయాలని మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. రైతుల అంగీకారం తీసుకున్నాక కూడా రిజిస్ట్రేషన్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. రిజిస్ట్రేషన్లు జాప్యం చేయడం వల్ల పనులు త్వరగా పూర్తిచేయలేమన్నారు. 2,3రోజులకోసారి ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సమీక్ష జరుపుకోవాలన్నారు. రంగనాయక సాగర్ కుడి, ఏడమ పనులను అడిగి తెలుసుకున్నారు. చిన్నకోడూరు, సిద్దిపేట మండలాల్లో వివిధ దశల్లో ఉన్న భూసేకరణ, భూతగాదాల్లో అధికారులతో చర్చించారు. జిఓ 123 ప్రకారం రైతులు స్వచ్చందంగా ముందుకొచ్చి భూములు అప్పగించే క్రమంలో వారికి తరుగుదల లేకుండా తగిన హోదా ఇచ్చేలా కృషి చేయాలన్నారు. కాళేశ్వరం పనుల పై ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా తనకు అప్‌డేట్ అందించాలని సూచించారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో అధికారులు జరిపే మానిటరింగ్ పనులపై రిపోర్టు ఇవ్వాలన్నారు. రోజువారీ రిపోర్టు అందించడమే కాక ప్రజాప్రతినిధులతో సమన్వయంగా ఉంటు సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ సమీక్షలో ఆర్డీఓ ముత్యంరెడ్డి, ఇరిగేషన్ చీప్ ఇంజనీర్ హరిరాం, ఎస్‌ఇ వేణు, ఇఇ ఆనంద్, ఇంజనీర్లు, ఎంపిపి శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.