మెదక్

కార్మిక చట్టాల సవరణను వ్యతిరేకించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, ఆగస్టు 28: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కార్మిక చట్టాల సవరణను వ్యతిరేకించాలని, సెప్టెంబర్ 2న జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి రాఘవులు పిలుపునిచ్చారు. సిఐటియు రాష్ట్ర ద్వితీయ మహాసభలను పురస్కరించుకొని ఆదివారం సంగారెడ్డి కేవల్ కిషన్ భవన్‌లో 25యేళ్ల సంస్కరణలు- కార్మికులపై ప్రభావం అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌కు రఘవులు ముఖ్య అతిధిగా హాజరైనారు. ఈ సందర్భంగా కార్మికులకు ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కార్మిక చట్టాల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోందు, దోందేనని విమర్శించారు. కార్మిక చట్టాలను మార్చుతూ తమ ఉనికిని చాటుకుంటున్నారని, తద్వారా దీర్గకాలంలో కార్మికులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. గత 25యేళ్లుగా దేశంలోని కార్మికులకు సిఐటియు అండగా పోరాటాలు చేస్తూ ఎప్పటికప్పుడు ముందుకేళ్తుందని గుర్తు చేశారు. ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలతో దేశంలో చాల మంది కార్మికులు తమ ఉనికిని కోల్పోతున్నారని, చేతి వృత్తులు కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గద్దెనెక్కకముందు ఒక మాట, గద్దెనెక్కిన తరువాత ఒక మాట ఇలా పూటకో మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. కార్మిక చట్టాలను పెట్టుబడిదారులకు అనుకూలంగా మారుస్తూ రెడ్ కార్పెట్ పరుస్తున్నారని, ఈ విధానాల వల్ల కార్మికులు ప్రశ్నించే హక్కు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. కార్పోరేట్ పరిశ్రమల్లో మహిళలకు ఉద్యోగాలు కల్పిస్తూ మగ వారితో సమానంగా అవకాశాలు కల్పిస్తూ దెబ్బతీస్తున్నారని, గిరిజన ప్రాంతాల వారిని తీసుకొచ్చి పనుల్లో పురమాయిస్తూ నాల్‌లోకల్ వ్యవస్తను పెంచుతున్నారని, తద్వారా యాజమాన్యాన్ని ప్రశ్నించే తత్వం ఉండకుండ చేస్తున్నారని విమర్శించారు. కార్మికులందరూ తమ ఉనికిని చాటుకోవడానికి సెప్టెంబర్ 2న జరిగే సమ్మెలో పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తమ సత్తా చాటాలన్నారు. సెమినార్‌లో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజయ్య, బిఎస్‌ఎన్‌ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి కిషన్‌రావు, సిఐటియు నాయకులు మల్లిఖార్జున్‌గౌడ్, మానిక్యం, జయరాజ్, నర్సమ్మ, లక్ష్మిబాయి, బాల్‌రాజ్, మహిపాల్, రేవంత్‌కుమార్, వివిధ ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.