మెదక్

పేదల సొంతింటి కల డబుల్ బెడ్‌రూం ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఆగస్టు 28: పేదల సొంతింటి కల డబుల్‌బెడ్ రూం..అర్హులైన పేదలందరికి డబుల్‌బెడ్ రూం ఇచ్చేందుకే తెలంగాణ సర్కార్ కృతనిశ్చయంతో పని చేస్తుందని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సిఎం కెసిఆర్ డబుల్‌బెడ్ రూం కోసం 5.40లక్షలు వెచ్చిస్తున్నారని తెలిపారు. పేదల ఆత్మగౌరవం కోసమే డబుల్ బెడ్‌రూంల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు తెలిపారు. మెదక్ జిల్లా సిద్దిపేట నర్సాపూర్‌లో నిర్మిస్తున్న డబుల్‌బెడ్ రూంల నిర్మాణ పనులను మంత్రి హరీష్‌రావు, అంచనాల కమిటి చైర్మన్ రామలింగారెడ్డి, ఆర్డీఓ ముత్యంరెడ్డితో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేటలో 118కోట్లతో 1960ఇండ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. పేదోళ్ల సొంతింటి కలను నిజం చేస్తున్నట్లు తెలిపారు. జి ప్లస్ 2 తరహాలో డబుల్ బెడ్‌రూంలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. నర్సాపూర్ వద్ద 1100, పొన్నాల వద్ద 860ఇండ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం టెండర్ ఫ్రక్రియ పిలిచినా ముందుకు రాలేదన్నారు. ఇటీవలే టెండర్ ప్రక్రియ పూరె్తైందని, పనులు వేగవంతమైతాయన్నారు. అవసరమైతే రేయింబవళ్లు పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. రాత్రి పూట ప్లడ్‌లైట్లతో నిర్మాణ పనులు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇక్కడ ఇండ్ల నిర్మాణంతో పాటు అవసరమైన రోడ్లు, విద్యుత్, మోరీలు అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని హంగులతో ఈ కాలనీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయన్నిరు. అధికారులు ఎప్పుడూ అందుబాటులో ఉండి పనులు పర్యవేక్షించాలని సూచించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ సర్కార్ సంక్షేమ పథకాలు తెచ్చి దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏజన్సీ ఎండి ప్రశాంత్, రెవెన్యూ, పిఆర్ అధికారులు పాల్గొన్నారు.