మెదక్

నూతన జిల్లాలకు వెళ్లే ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆప్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, ఆగస్టు 28: నూతన జిల్లాలకు వెళ్లే ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆప్షన్ ఇవ్వాలని, జిల్లాకేంద్రాల్లో 20శాతం హెచ్‌ఆర్‌ఎ అమలు చేయాలని ఎస్‌టియు జిల్లా అధ్యక్షులు సడిమెల యాదగిరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సంగారెడ్డిలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో 25అంశాలపై ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, కార్పోరేట్ ఆసుపత్రుల్లో హెల్త్‌కార్డులు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని, విద్యాహక్టు చట్టం ప్రకారం పాఠశాలల్లో వౌళిక సదుపాయాలు కల్పించాలని, ఉపాధ్యాయులకు యుజిసి స్కేల్ ఇవ్వాలని, మహిళా ఉద్యోగులకు ప్రత్యేక రక్షణ కల్పించాలని, రెండేళ్ల చైల్డ్‌కేర్ సెలవులు మంజూరు చేయాలని తదితర తీర్మాణాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. కార్యక్రమంలో ఎస్‌టియు నాయకులు రమేష్, శంకర్, సుధాకర్, సదన్, శంకర్‌బాబు, ప్రభాకర్, గోపాల్‌రావు, శ్రీనివాస్, జీవన్, రాజగోపాల్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.