మెదక్

బడుగు, బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, సెప్టెంబర్ 22: బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేసేది కాంగ్రెస్ పార్టీయేనని, రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తామని టిపిసిసి కోశాధికారి,కాంగ్రెస్ నిఘా ఫైనాన్స్ కమిటీ కన్వీనర్ గూడురి నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి మహేష్‌గౌడ్‌లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని పది జిల్లాల్లో ఉన్న కాంగ్రెస్ ఆస్తులు, పార్టీ జిల్లా కార్యాలయాలు, నిర్మాణంలో ఉన్న భవనాలు, అసంపూర్తిగా మిగిలిపోయిన భవనాలను పరిశీలించేందుకు అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. జిల్లాకేంద్రంలో అసంపూర్తిగా ఉన్న పార్టీ జిల్లా కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పార్టీకి సంబంధించి అవసరమున్న భవనాలు, నిర్మాణంలో ఉన్న భవనాలను, ఆస్తుల వివరాలు సేకరించి హైకమాండ్‌కు నివేదిస్తామన్నారు. వారు పరిశీలించిన తరువాత కావాల్సిన నిధులను టిపిసిసికి విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. సిఎం కెసిఆర్ పూటకో హామిలిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాడని, ఎన్నికల్లో ఇచ్చిన హామిలే ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శించారు. కమిటి సభ్యులు వినోద్‌రెడ్డి, రాం చంద్రారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోపాజీ అనంతకిషన్, జెడ్పీటిసి ప్రభాకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొన్న శంకర్‌రెడ్డి, నాయకులు సాబేర్, కుమార్, కసిని రాజు, శ్రీకాంత్, సంజీవ్, నవాజ్, భిక్షపతి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.